ఇద్దరు ఎన్ఆర్ఐలను పట్టుకోవడానికి యూకేలో ‘‘ ఆపరేషన్ పాల్కాలా’’.. ఏం చేశారంటే..?

2018 నాటి మనీలాండరింగ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు యూకేలోని న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.స్కాట్లాండ్ యార్డ్ ఎకనమిక్ క్రైమ్ యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.

 2 Indian-origin Men Jailed For Over 12 Years For Money Laundering Case In Uk, Mo-TeluguStop.com

భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృష్ణ స్వామి (32), చంద్రశేఖర్ నలయన్‌ (44)లు వేరు వేరు ఐపీ అడ్రస్‌ల ద్వారా బార్క్లేస్ బ్యాంక్‌లోని పలు బిజినెస్ ఖాతాలను యాక్సెస్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు.

ఇందుకు సంబంధించి బ్యాంక్ అధికారులు దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎకనామిక్ క్రైమ్ యూనిట్, సైబర్ డిఫెన్స్ అలయన్స్ (సీడీఏ) నిందితుల కోసం సంయుక్తంగా ‘‘ ఆపరేషన్ పాల్కాలా’’ను ప్రారంభించింది.ఈ క్రమంలో అనుమానిత ఐపీ అడ్రస్‌లను గుర్తించి దర్యాప్తు ప్రారంభించి.

చివరికి విజయ్ కుమార్ కృష్ణస్వామి, చంద్రశేఖర్‌‌లను పట్టుకున్నారు.

ఇద్దరు ఎన్ఆర్ఐలను పట్టుకోవడా

ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలు వీరి చేతిలో మోసపోయినట్లుగా దర్యాప్తులో తేలింది .నిందితులిద్దరూ ఈ హవాలా సొమ్మును బ్రిటన్ దాటించారని, దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా కష్టమేనని డిటెక్టీవ్ విభాగం చెబుతోంది.వీరిద్దరూ కొట్టేసిన మొత్తం 2.4 మిలియన్ పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.22,38,67,680).దర్యాప్తు అనంతరం నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.నేరపూరిత ఆస్తులను దాచడం, బదిలీ చేయడం వంటి నేరాల కింద న్యాయస్థానం విజయ్ కుమార్‌కి ఐదేళ్ల 9 నెలలు, చంద్రశేఖర్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube