అమెరికా యూనివర్సిటీకి “ తెలుగు వ్యక్తి ” భారీ విరాళం..ఎంతో తెలుసా..!!

భారతదేశం నుంచి అమెరికా వెళ్లి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు అమెరికాలో వివిధ రంగాలలో లో స్థిరపడి ఎన్నో విశిష్టమైన సేవలను అందిస్తున్నారు.

 Million Dollars Donations To University Of California, University Of California,-TeluguStop.com

సొంత రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే అమెరికాలో సుపరిచితుడు అయిన ఎపీలోని కృష్ణా జిల్లాకి చెందిన ప్రవాసాంధ్రుడు డాక్టర్ లక్కి రెడ్డి హనిమిరెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెర్సుద్ నగరం లో గల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు మరోసారి భారీ విరాళాన్ని అందజేశారు.మెర్సుద్ – 2020 ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ విక్రమ్ రెడ్డి ఆయన సతీమణి ప్రియా దంపతులు సదరు యూనివర్సిటీకి 8,804 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.

విశ్వవిద్యాలయ విస్తరణ పనులు అలాగే యూనివర్సిటీ క్యాంపస్ లో కాన్ఫరెన్స్ సెంటర్లో నిర్మించిన సెంట్రల్ హాల్ కు దంపతులు భారీ మొత్తాన్ని అందజేశారు.ఈ క్రమంలో

డాక్టర్ లక్కి రెడ్డి కుటుంబం యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని యూనివర్సిటీ పై లక్కిరెడ్డి కుటుంబానికి ఉన్న అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

వారందించిన విరాళంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ హాలులో విద్యాపరమైన సభలు విద్యార్థుల సమ్మేళనం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది.గతంలో కూడా లక్కిరెడ్డి కుటుంబం మిలియన్ డాలర్ల మొత్తాన్ని యూనివర్సిటీకి విరాళంగా అందజేశారని వారి సేవలు యూనివర్సిటీ ఎప్పటికి గుర్తు ఉంచుకుంటుందని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube