సింగపూర్: కాంట్రాక్ట్‌లో మోసం.. తప్పించుకునేందుకు అధికారికి లంచం, భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష

లంచం కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది.సింగపూర్‌లోని సెక్యూరిటీ సంస్థకు గతంలో బాస్‌గా వ్యవహరించిన నిందితుడు సోమవారం స్థానిక ఆర్చర్డ్ రోడ్‌లోని హోటల్ బెల్ట్ సమీపంలోని డిపార్ట్‌మెంట్ స్టోర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మేనేజర్‌కు లంచం ఇచ్చినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Indian-origin Man Jailed In Singapore For Shortfall In Supply Of Security Guards-TeluguStop.com

నిందితుడిని మందిర్ సింగ్‌గా గుర్తించారు.ఇతనికి చెందిన వైట్‌నైట్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ .ఎన్జీ ఆన్ సిటీమాల్‌లోని టకాశిమయ డిపార్ట్‌మెంట్‌‌ సెక్యూరిటీ బాధ్యతలు చూస్తోంది.ఇక్కడ పగటి పూట షిఫ్ట్‌లో తగినంతమంది సెక్యూరిటీ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.

టకాశిమయ స్టోర్‌తో వైట్‌నైట్స్‌కు జరిగిన ఒప్పందం ప్రకారం.సిబ్బంది కొరత ఏర్పడినప్పడు డిపార్ట్‌మెంట్ స్టోర్‌కు నష్టపరిహారాన్ని చెల్లించాలి.

అయితే ఈ సమస్యను కప్పిపుచ్చేందుకు గాను మందిర్ సింగ్.టకాషిమయా సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మేనేజర్ కుయెన్ థాంగ్‌కు లంచం ఇస్తూ వస్తున్నాడు.దీనిలో భాగంగా చాన్‌కు గడిచిన మూడేళ్లుగా 1,21,000 సింగపూర్ డాలర్లను ఇచ్చాడు.దీని వల్ల టకాశిమయ సంస్థకు 4,79,700 డాలర్లు నష్టం జరిగింది.

విచారణలో భాగంగా మందిర్ సింగ్‌ నేరాన్ని అంగీకరించాడు.ఇందులో 5 అభియోగాలకు కోర్టు శిక్ష ఖరారు చేయగా.మరో 15 అభియోగాలపై శిక్ష విధించాల్సి వుంది.అటు డిపార్ట్‌మెంట్ స్టోర్ సెక్యూరిటీ మేనేజర్ చాన్‌పై కూడా పలు అభియోగాలు మోపగా.

ప్రస్తుతం అతని కేసు పెండింగ్‌లో వుంది.అంతేకాకుండా చాన్ సిఫారసుల వల్లే టకాశిమయ సంస్థ 2017 నుంచి 2021 వరకు సెక్యూరిటీ బాధ్యతలను వైట్ నైట్స్‌కు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.

మొత్తంగా వైట్ నైట్స్ టకాశిమయతో మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది.దీనిలో భాగంగా 18 మందిని ఉదయం పూట, ఆరుగురిని రాత్రి పూట షిఫ్ట్‌కు సెక్యూరిటీగా పంపాల్సి వుంది.

అయితే 2017 జనవరిలో కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చిననాటి నుంచి ప్రతి రోజూ షిఫ్ట్ కింద ముగ్గురు లేదా నలుగురు సిబ్బందిని పంపించేవాడని తేలింది.ఈ మొత్తం అభియోగాలు రుజువైతే మందిర్‌కు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 1,00,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube