బ్రిటన్ : భార్యను కత్తితో పొడిచి దారుణహత్య.. భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు

భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్ట్ జీవిత ఖైదు విధించింది.అనిల్ గిల్ (47) భార్యతో కలిసి ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని మిల్టన్ కీన్స్ ఏరియాలో నివసిస్తున్నాడు.

 Indian-origin Man Jailed For Life In Uk For Stabbing Wife To Death, Indian Origi-TeluguStop.com

ఈ ఏడాది జనవరిలో 43 ఏళ్ల రంజిత్ గిల్‌ను హత్య చేశారనే ఆరోపణలతో థేమ్స్ వ్యాలీ పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.రంజిత్ శరీరంపై బలమైన గాయాలు వుండటంతో పాటు గ్యారేజ్ ఏరియాలో ఒక బొంతలో చుట్టిన స్ధితిలో ఆమె డెడ్ బాడీ దొరికింది.

రంజిత్ మరణించి చాలా రోజులు అయినట్లుగా గుర్తించారు.అంతేకాకుండా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రంజిత్ కత్తిపోట్ల వల్ల మరణించినట్లు నిర్ధారించారు.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో అనిల్‌పై హత్య కేసు నమోదవ్వగా.గత శుక్రవారం లుటన్ క్రౌన్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

పెరోల్‌కు అర్హత సాధించాలంటే అనిల్ కనీసం 22 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుంది.

థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

విచారణ సమయంలో అనిల్ తాను హత్యకు పాల్పడలేదని వాదించాడు.అయితే రంజిత్ చర్యలు, ప్రవర్తన కారణంగా ఆమెకు తీవ్రమైన హానీ కలిగించానని అంగీకరించాడు.

ఇదే సమయంలో నిందితుడు అనిల్.రంజిత్‌ను కనీసం 18 సార్లు కత్తితో పొడిచాడని కోర్టు విచారణలో తేలింది.

ఆ తర్వాత కొద్దిగంటల పాటు శ్రమించి ఇంటిని శుభ్రం చేశాడని.అనంతరం రంజిత్ బాడీని బిన్ బ్యాగ్‌లలో చుట్టి గ్యారేజీలో పడేశాడు.

రంజిత్ సోదరుడు, రాజ్ సాగూ మాట్లాడుతూ.తన సోదరి మరణం తర్వాత జీవితంలో శూన్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది ఎప్పటికీ నయం కాని శూన్యమని ఆయన అన్నారు.మంచి చెడులలో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమించాల్సిన వ్యక్తి తన చెల్లెలిని దూరం చేశాడని రంజిత్ అక్క తేజిందర్ మెక్‌కాన్ ఉద్వేగానికి గురయ్యారు.

Telugu Indian Origin, Indianorigin, Stabbed, Nri, Uk, Uk Murdered-Telugu NRI

కాగా.గత వారం భార్యను, ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అమెరికా కోర్ట్ జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.శంకర్ నాగప్ప హంగుడ్ అనే ఇండో అమెరికన్ 2019లో తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు అంగీకరించడంతో కోర్ట్ అతనికి పెరోల్ లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.కాలిఫోర్నియాలోని తన అపార్ట్‌మెంట్‌లోనే శంకర్ (55) ఈ హత్యలకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.

ప్లేసర్ కౌంటీలో శిక్ష విధించే సమయంలో దీనిపై నిందితుడు మౌనంగా ఉండిపోయినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube