సింగపూర్ పబ్లిక్ హౌసింగ్ రెసిడెన్షియల్ యూనిట్‌లో అధికారులు తనిఖీలకు రాబోతున్నట్లుగా ముందుగానే హెచ్చరించి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన 23 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి అక్కడి కోర్టు 25 రోజుల జైలు శిక్ష విధించింది.అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ఏ) కింద అతనిపై అధికారులు రెండు అభియెగాలు మోపారు.
నిందితుడిని దమన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.కలయరసన్ కరుప్పయ్య (55) అనే అధికారి సాయంతో ఇతను నేరానికి పాల్పడినట్లుగా తేల్చారు.
పబ్లిక్ హౌసింగ్ అథారిటీలో తనిఖీ అధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి.ఫ్లాట్‌లు, నివాస సముదాయాలలో పరిమితికి మించి ఎవరైనా నివసిస్తున్నారా అన్న దానిపై తనిఖీ చేయాల్సి వుంటుంది.
ఈ క్రమంలో తాను తనిఖీకి వస్తున్నానని.జాగ్రత్తగా వుండాలంటూ తన ఫ్లాట్‌లో నివసిస్తున్న భారతీయ అద్దెదారుడికి ముందే సమాచారం ఇచ్చేవాడు.
గతేడాది వెలుగుచూసిన ఈ నేరానికి సంబంధించి భారత సంతతికి చెందిన అధికారి కలయరసన్ కరుప్పయ్య (55)ను గతేడాది జనవరి 25 నుంచి హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (హెచ్‌డీబీ) విధుల నుంచి అధికారులు సస్పెండ్ చేశారు.సదరు అధికారి.
తన ఇంట్లో నివసిస్తున్న భారత్‌కు చెందిన దమన్‌దీప్ సింగ్‌కు తాను తనిఖీకి రాబోతున్న సమాచారాన్ని ముందే తెలియజేశాడు.ఇది అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని అభియోగం మోపారు.
కరుప్పయ్య 2019లో అనేక సందర్భాల్లో హెచ్‌డీబీ తనిఖీల గురించి దమన్‌దీప్ సింగ్‌కు ముందే చెప్పినట్లుగా ఆరోపణలు వున్నాయి.ఈ కేసుకు సంబంధించి గతేడాది జనవరి 9న సింగపూర్‌లోని కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీబీబీ)కి ఫిర్యాదు అందింది.దమన్‌దీప్ సింగ్ రిజిస్టర్డ్ అద్దెదారుగా వున్న ఫ్లాట్‌లో పరిమితికి మించి నివసిస్తున్న హెచ్‌డీబీకి ఫిర్యాదు అందింది.2019 ఆగస్టు 24, సెప్టెంబర్ 4న విడివిడిగా జరిపిన రెండు తనిఖీల్లోనూ ఈ ఫ్లాట్ కిక్కిరిసి వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ప్రతి సందర్భంలోనూ వరుసగా 19 మంది, 18 మంది ఆ ఫ్లాట్‌లో ఆశ్రయం పొందుతున్నట్లుగా వుంది.ఇక్కడి నిబంధనల ప్రకారం ఒక ఫ్లాట్‌లో కేవలం ఆరుగురికి మాత్రమే అనుమతి వుంది.
2017లో దమన్‌దీప్ సింగ్.కలయరసన్ కరుప్పయ్య (55)ని కలిశారు.
దమన్ నివసిస్తున్న యూనిట్‌లో కరుప్పయ్య తనిఖీలు చేస్తుండగా వారిద్దరికి పరిచయం ఏర్పడింది.తర్వాత వారిద్దరూ స్నేహితులుగా మారడంతో పాటు పలుమార్లు ఫోన్ చేసుకోవడం, అప్పుడప్పుడు కలిసేవారు.
ఆ తర్వాత దమన్‌దీప్ సింగ్ మరో యూనిట్‌కు వెళ్లాడు.అక్కడ చట్టవిరుద్ధంగా 12 లేదా 13 మంది వ్యక్తులు అదే ఎస్టేట్‌లో నివసిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రెసిడెన్షియల్ యూనిట్‌లో గరిష్ట సంఖ్యలో ఆరుగురే వుండాలన్న నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదు.వీరి వద్ద నుంచి నుంచి ప్రతినెలా సుమారు 200 సింగపూర్ డాలర్లను వసూలు చేసేవారు.

అయితే ఇక్కడ అధిక రద్దీ, మితిమిరిన జనసంచారంపై హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డు, ఇతర అధికారులు, పోలీసులకు ప్రజలు పలు ఫిర్యాదులు అందజేశారు.ఇదే సమయంలో దమన్‌దీప్ సింగ్‌కు తన స్నేహితుడు కరుప్పయ్య ద్వారా హెచ్‌డీబీ అధికారుల తనిఖీ వివరాలు ముందే తెలిసేది.ఈ రకంగా మే 8, 2019 అలాగే సెప్టెంబర్ 10, 2019రోజులల ప్లాన్ చేసిన ఆకస్మిక తనిఖీల గురించి కరుప్పయ్య ముందే సమాచారం అందించడంతో దమన్‌దీప్ సింగ్ తనతో పాటు అక్రమంగా వుంటున్న అద్దెదారులను అప్రమత్తం చేశాడు.దీంతో తనిఖీలకు వెళ్లిన హెచ్‌డీబీ అధికారులు ఒట్టిచేతులతో వెనక్కి రావాల్సి వచ్చింది.
అయితే పోలీసుల నుంచి మాత్రం దమన్ తప్పించుకోలేపోయాడు.అక్రమంగా నివసిస్తున్న వారి సమాచారాన్ని పోలీసులు హెచ్‌డీబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు తెలియజేయడంతో అతని అద్దె రద్దు చేశారు.
సెప్టెంబర్ 2019లో యూనిట్ మొత్తాన్ని ఖాళీ చేయించారు అధికారులు.