బ్రిటన్ లో బ్యాంకు ఖాతాలు హ్యాక్... ఎన్ఆర్ఐకి జైలు శిక్ష  

Indian Origin Man Jailed For Cyber Fraud In Uk-cyber Crime,cyber Fraud,indian Origin Man Jailed,uk

ఇండియన్ ప్రజలకి ప్రధానంగా ఉండే జబ్బు ఈజీ మనీ.కష్టపడకుండా ఈజీగా మని సంపాదించడానికి తమ తెలివితేటలని ఉపయోగిస్తూ ఉంటారు.

Indian Origin Man Jailed For Cyber Fraud In Uk-cyber Crime,cyber Fraud,indian Origin Man Jailed,uk తెలుగు అవి ఇవి వింత తెలియని వాస్తవాలను మిస్టరీ విశేషాలు -Indian Origin Man Jailed For Cyber Fraud In UK-Cyber Crime Cyber Indian Uk

అయితే ఇలా చేసే క్రమంలో మొదట్లో భాగానే డబ్బులు సంపాదించిన ఏదో ఒక రోజు మాత్రం ఇరుక్కోక తప్పదు.తప్పుడు పనులు చేసి ఇండియాలో తప్పించుకునే అవకాశం ఉందేమో కాని చట్టాలు కఠినంగా ఉండే బ్రిటిష్ దేశాలలో అస్సలు తప్పించుకోలేరు.

తాజాగా బ్రిటన్ లో సెటిల్ అయిన ఓ ప్రవాస భారతీయుడు బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేసి కోట్ల సొమ్ము కాజేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు.నేరం రుజువు కావడంతో అతనికి జైలు శిక్ష పడింది.

ఉస్మాన్ ఖవాజా(32) అనే వ్యక్తి బ్రిటన్‌లో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.అతని కింద నవీద్ పాషా(56)తోపాటు అభయ్ సింగ్ పనిచేశాడు.

వీరంతా కలిసి ఎవరిని అయితే టార్గెట్ చేసేవారో వారి కంప్యూటర్లకు దొంగ సాఫ్ట్‌వేర్ల సాయంతో మాల్‌వేర్‌ను పంపి, వారి బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసేవారు.ఆ తరువాత వారి బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.

ఇలా 2016 నుంచి 2019 వరకూ కొన్ని కోట్ల రూపాయలు ఈ ముఠా కాజేసింది.పక్కా ప్లాన్ ప్రకారం నేరాలు చేస్తూ వచ్చిన వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఘట్టి నిఘా పెట్టాల్సి వచ్చింది.

చివరికి వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రిటన్ లో బర్మింగ్‌హామ్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.వారు చేసిన నేరం రుజువు కావడంతో ఉస్మాన్ ఖవాజాకు నాలుగున్నరేళ్ల జైలు, నవీద్ పాషాకు రెండేళ్లు, అభయ్ సింగ్‌కు 40నెలల జైలు శిక్ష విధించారు.

తాజా వార్తలు

Indian Origin Man Jailed For Cyber Fraud In Uk-cyber Crime,cyber Fraud,indian Origin Man Jailed,uk Related....