అధికారులపై దాడి, జాత్యహంకార వ్యాఖ్యలు... సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు

పోలీస్ అధికారులపై దాడి, వేధింపులు, జాత్యహంకార వ్యాఖ్యలు సహా తదితర నేరాలకు సంబంధించి భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ కోర్ట్ బుధవారం 21 నెలల నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.నిందితుడిని సంజీవన్ మహా లింగం (43)గా గుర్తించారు.

 Indian-origin Man Jailed For Assaults And Racist Comments In Singapore , Sanjeevan Mahalingam, Singapore Court, The Straits Times, Deputy Public Prosecutor Jordan Lee, Sergeant Mohammad Firdaus Hussain,-TeluguStop.com

ఇతను తన పుట్టినరోజును పురస్కరించుకుని గతేడాది సెప్టెంబర్ 24న ఒక బిన్ సెంటర్‌లో నిద్రిస్తున్న క్లీనింగ్ కార్మికుడితో వాగ్వాదానికి దిగడంతో పాటు అతనిపై చేయి చేసుకున్నాడు.ఈ ఘటనలో అతని దవడకు గాయమైంది.

ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.సంజీవన్ తనపై నమోదు చేసిన ఐదు అభియోగాలను అంగీకరించాడు.డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోర్డాన్ లీ మాట్లాడుతూ.క్లీనర్‌ రాత్రి 7 గంటల సమయంలో విధులు ముగించుకుని బ్లాక్ 1 జలాన్ కుకో హౌసింగ్‌ ఎస్టేట్‌లోని బిన్ సెంటర్ సోఫాలో నిద్రపోయాడు.ఈ క్రమంలో ఆ రోజు రాత్రి 11.15 గంటలకు సంజీవన్ సదరు క్లీనర్‌ను నిద్రలేపి.వాగ్వాదానికి దిగాడు.ఈ వివాదంలో సంజీవన్ బాధితుడి ఎడమ చెంపపై కొట్టాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.క్లీనర్ మరుసటి రోజు తన దవడ నొప్పిగా వుండటంతో వైద్యుడిని సంప్రదించాడు.ఈ సమయంలో దవడ విరిగిందని.

 Indian-origin Man Jailed For Assaults And Racist Comments In Singapore , Sanjeevan Mahalingam, Singapore Court, The Straits Times, Deputy Public Prosecutor Jordan Lee, Sergeant Mohammad Firdaus Hussain, -అధికారులపై దాడి, జాత్యహంకార వ్యాఖ్యలు#8230; సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శస్త్ర చికిత్స చేయించుకోవాలని డాక్టర్ సూచించారు.దీనిపై సంజీవన్ మాట్లాడుతూ.

తన తల్లిదండ్రులు దగ్గర లేరని అందువల్ల తన పుట్టినరోజును ఒంటరిగా జరుపుకోవాల్సి వచ్చిందన్నారు.ఈ క్రమంలోనే కేక్ ఇచ్చేందుకే క్లీనర్‌ను నిద్రలేపానని.

ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుందని న్యాయమూర్తికి తెలిపాడు.

ఇకపోతే.

ఈ ఘటనకు పన్నెండు రోజుల ముందు సెప్టెంబర్ 12న హాంగ్ లిమ్ మార్కెట్, ఫుడ్ సెంటర్ వద్ద మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఘటనలోనూ సంజీవనే నిందితుడిగా తేలింది.బాటిల్ పట్టుకుని మద్యం మత్తులో వున్న అతను తనతో మాట్లాడుతున్న ఓ అధికారిపై దుర్భాషలాడాడు.

దీంతో అధికారులు అతనిని అరెస్ట్ చేసి పోలీస్ కంటోన్మెంట్ కాంప్లెక్స్‌ లాకప్‌కు తరలించారు.ఎడమ చేతికి బేడీలు వేసి ఒక బెంచ్‌పై కూర్చొబెట్టారు.ఈ సమయంలో సంజీవన్ చెప్పు తీసుకుని ఒక అధికారిపైకి విసిరేశాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన మరో ఘటనలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బ్లాక్ 34 అప్పర్ క్రాస్ స్ట్రీట్ పరిసరాల్లో ఒక వ్యక్తి మహిళను వేధిస్తున్నాడని సమాచారం అందుకున్న సార్జెంట్ మొహమ్మద్ ఫిర్దౌస్ హుస్సేన్ ఆ రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడికి చేరుకున్నారు.ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా.

అధికారులు 51 చిన్ స్వీ రోడ్‌లోని ఫిట్‌నెస్ కార్నర్‌లో సంజీవన్‌ని చూసి అనుమానించారు.

అతని బ్యాక్ పాకెట్‌లో గాజు పైపు కనిపించడంతో వారు అతనిని అరెస్ట్ చేసి పోలీస్ కంటోన్మెంట్ కాంప్లెక్స్‌కు తరలించారు.స్టేషన్‌లో అతని నుంచి యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కోసం స్వాబ్ తీసుకుంటుండగా సంజీవన్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు.పదే పదే మాస్క్‌ను తీసివేయడంతో పాటు సార్జెంట్ ఫిర్దౌస్‌ ముఖంపై ఉమ్మివేసి, జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు.

ఈ నేరాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన ప్రాసిక్యూటర్.అతను పదే పదే నేరాలకు పాల్పడినట్లు చెప్పాడు.

ఈ నేరాలకు సంబంధించి సంజీవన్‌కు పదేళ్ల జైలు, జరిమానా విధించవచ్చు.అలాగే ఒక ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కలిగించినందుకు మరో నాలుగేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు.

వేధింపులకు గాను రెండేళ్ల జైలు శిక్ష లేదా 10,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించవచ్చు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube