అమ్మను పూజించాల్సిన రోజు... తల్లిపైనే లైంగిక దాడి, దారుణహత్య: భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సృష్టికి మూలం అమ్మ.ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ.

 Indian Origin Man In Us Sexually Assaults Kills Mom On Mothers Day Eve-TeluguStop.com

అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు.ప్రతి ఏడాది మే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవంగా జరుపుకుంటారు.

ఆ రోజున తమను నవమాసాలు మోసి, పెంచి, పెద్ద చేసిన తల్లిని పూజించమని చెబుతారు.అలాంటి పవిత్రమైన రోజున కన్నతల్లిపై అత్యచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను దారుణంగా హతమార్చాడో కొడుకు.

 Indian Origin Man In Us Sexually Assaults Kills Mom On Mothers Day Eve-అమ్మను పూజించాల్సిన రోజు… తల్లిపైనే లైంగిక దాడి, దారుణహత్య: భారత సంతతి వ్యక్తి అరెస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అది కూడా తల్లిని దైవంలా పూజించే భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళితే.భారత సంతతికి చెందిన పుష్కర్ శర్మ(28) తన తల్లి సోరజ్ శర్మ, సోదరితో కలిసి జమైకాలోని బెల్లెరోస్‌ మేనర్‌లో కలిసి ఉంటున్నాడు.అయితే, గత కొంతకాలంగా పుష్కర్ శర్మ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు.మాతృదినోత్సవం రోజైన శనివారం ఉదయం పుష్కర్‌కి మనసులో ఒక చెడు ఆలోచన మెదిలింది.

ఎవరినైనా దారుణంగా హింసించాలని అతను నిర్ణయించుకున్నాడు.అంతే ఇంట్లో ఉన్న తన తల్లి సోరజ్ శర్మను వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఆమెపై దాడి చేశాడు.

దీంతో ఆమె కిందపడిపోయింది.అయినప్పటికీ విడిచిపెట్టక ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు.

దీంతో సోరజ్ శర్మ సృహ కోల్పోయారు.ఈ స్థితిలోనూ కన్న తల్లి అన్న కనికరం కూడా లేకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో సోరజ్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Telugu America, Belleros Manor In Jamaica, International Mother\\'s Day, Pushkar Sharma, Queens District Attorney Melinda Katz, Soraj Sharma-Telugu NRI

పనిమీద బయటకు వెళ్లిన పుష్కర్ శర్మ సోదరి ఇంటికి తిరిగి వచ్చి తన తల్లి నిర్జీవంగా పడివుండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.అయితే, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.సమాచారం అందుకున్న పోలీసులు.

ఘటనా స్థలానికి చేరుకుని పుష్కర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

కాగా, మదర్స్ డే రోజున ఓ తల్లిపైనే ఈ దారుణ ఘటన జరగడంపై క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మెలిందా కట్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన మాతృ దినోత్సవం ఇలా విషాదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరం రుజువు కావడంతో పుష్కర్ శర్మ జైలుకు తరలించారు.ఈ కేసుపై మే 24 విచారణ జరగనుంది.

#BellerosManor #America #Pushkar Sharma #Soraj Sharma #QueensDistrict

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు