సింగపూర్ : ఖాళీగా వున్న కాలేజీలే టార్గెట్.. కేబుల్స్ దొంగతనం, భారత సంతతి వ్యక్తికి జైలు

దొంగతనం కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి 42 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.జనవరి 2020లో ఖాళీగా వున్న కాలేజ్ నుంచి కాపర్ వైర్లు, కేబుల్స్ దొంగిలించినందుకు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.

 Indian-origin Man In Singapore Sentenced For Stealing Wires From College Details-TeluguStop.com

భారత సంతతి వ్యక్తితో పాటు ఇద్దరు విదేశీ కార్మికులు కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నారు.నిందితుడిని ఓం శక్తి తివారీగా గుర్తించారు.

ఇతను తన బంగ్లాదేశ్ మిత్రులతో కలిసి ఘటన జరిగిన రోజు రాత్రి ఖాళీగా వున్న కాలేజీలోంచి కిలోల కొద్దీ ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించాడు.తొలుత 994 కిలోల కేబుల్‌ను రీ సైక్లర్స్‌కు 3,976 సింగపూర్ డాలర్లకు.

తర్వాత మరో 773 కిలోల కేబుల్‌ను అదే దుకాణదారుడికి మరో 3,976 సింగపూర్ డాలర్లకు విక్రయించాడు.ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని తనకు సాయం చేసిన బంగ్లాదేశ్ మిత్రులకు ఇచ్చినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.

విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయుడు మియా షోబస్. దొంతనం చేసేందుకు వీలుగా కాలేజ్ తలుపులు బద్ధలు కొట్టినట్లు మంగళవారం నేరాన్ని అంగీకరించాడు.మరో బంగ్లాదేశ్‌ జాతీయుడు జన్‌షక్ మొహబ్బత్‌తో కలిసి ఈ కుట్రలో పాల్గొన్నట్లు మియా తెలిపాడు.తామిద్దరం తాళం పగులగొట్టి మెయిన్ స్విచ్ గదిలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు.

ఈ ముగ్గురూ అదే నెలలో మరో కాలేజీలోనూ కాపర్ వైర్లను దొంగిలించారు.తివారీ ఎప్పటిలాగే వైర్లను రీ సైక్లింగ్ షాపుల్లో విక్రయించి వచ్చిన డబ్బును పంచాడు.

Telugu Colleges, Deputypublic, Electric Cables, Indian Origin, Miah Shobus, Sing

సీలింగ్‌, ఎలక్ట్రికల్ రైజర్‌లు, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ రూమ్, ఎలక్ట్రికల్ కేబుల్స్‌ను వీరు ముగ్గురు దొంగతనం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.అయితే జురాంగ్ జూనియర్ కాలేజీలోని బాటిల్‌పై వున్న నిందితుల లాలాజలంలో డీఎన్ఏ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించగలిగారు.అలాగే పబ్లిక్ హౌసింగ్ ఎస్టేట్‌లోని సీసీటీవీ కెమెరాల ద్వారా మియాను గుర్తించారు.వీరి దొంగతనం కారణంగా రెండు కాలేజీలలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను పునరుద్ధరించడానికి 1.24 మిలియన్ల సింగపూర్ డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.విచారణ అనంతరం జాన్‌కు 34 నెలలు, మియాపై నమోదు చేసిన మరో పది అభియోగాల ఆధారంగా డిసెంబర్ 23న అతనికి శిక్ష విధించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube