అధిక రాబడులు ఆశ చూపి.. భారీ వసూళ్లు: భారతీయుడికి ఏడేళ్ల జైలు

కాస్త పెట్టుబడి పెట్టండి భారీగా రాబడులు అందుకోండి అంటూ వసూళ్లు చేసి మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.నకిలీ పెట్టుబడి పథకాన్ని నడిపిన నిందితుడు తోటి భారతీయులతో పాటు ఇరుగుపొరుగు వారిని మోసం చేసి 1 మిలియన్ సింగపూర డాలర్ల డబ్బును తన స్వంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు.వివరాల్లోకి వెళితే.36 ఏళ్ల సతీష్ నాయర్ ధన్ ‌బాలన్.భారత సంతతికే చెందిన ఎలంగోవన్ పిళ్లై మునిసామి (56)ని మాయమాటలతో తొలుత బుట్టలో వేసుకుని అతని చేత పెట్టుబడులు పెట్టించినట్లు స్ట్రెయిల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

 Indian-origin Man In Singapore Jailed For Nearly 7 Years For Cheating, Fraud, Si-TeluguStop.com

ఈ విధంగా 2014 నుంచి 2016 వరకు ఎలంగోవన్‌ నుంచి 2,00,000 సింగపూర్ డాలర్లను వసూలు చేశాడు.

తాను ఆ డబ్బును బాగా రాబడి వచ్చే పథకాలలో పెట్టినట్లు నమ్మించాడు.ఇదే సమయంలో ఇతను ఎవరి వద్దనైతే డబ్బు తీసుకున్నాడో వారికి హోచింగ్ అనే వ్యక్తి నుంచి టెక్ట్స్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వచ్చాయి.ఈ విధంగా మొత్తం తొమ్మిది మందిని 1 మిలియన్ సింగపూర్ డాలర్ల మేర ధనబాలన్ మోసం చేశాడు.2017లో ధన్‌బాలన్ మరో ముగ్గురిని మోసం చేసి వారి నుంచి వసూలు చేసిన సొమ్ముతో బార్క్‌లేస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టాడు.బాధితులను ఫదిలా ఇబ్రహీం, అనిజ్ సిరాజుద్దీన్ షేక్ అబ్ధుల్లా, బరకతునిసా‌లుగా గుర్తించారు .వీరి వద్ద నుంచి మొత్తం 4,00,000 సింగపూర్ డాలర్లను ధనబాలన్ వసూలు చేశాడు.

వారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగితే ఏవేవో కుంటి సాకులు చెప్పేవాడు.అంతేకాకుండా తాను డబ్బు ఎందుకు ఇవ్వలేకపోతున్నానో చెప్పేందుకు ప్రభుత్వ సంస్థలకు చెందిన నకిలీ పత్రాలను కూడా రూపొందించాడు.

అయితే అతని మోసం బయటపడటంతో పోలీసులు ధన్‌బాలన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.విచారణ సందర్భంగా మొత్తం 20 ఆరోపణలకు గాను ధన్‌బాలన్ తన నేరాన్ని అంగీకరించాడు.

ఈ కేసులకు సంబంధించి సింగపూర్ కోర్ట్ బుధవారం ఆరు సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube