సిక్కు యువకుడిపై ఖలీస్తానీ ముద్ర: ఫేస్‌బుక్‌లో దుష్ప్రచారం.. భారతీయుడి అరెస్ట్

సోషల్ మీడియాలో సిక్కు యువకుడిని బెదిరించడం సహా అతనిపై అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేసినందుకు న్యూజిలాండ్‌లోని అక్లాండ్ పోలీసులు భారత సంతతి వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు.సదరు నిందితుడు గతంలో మరికొంత మందిని కూడా ఇలాగా బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 Indian Origin Man In New Zealand Arrested For Allegedly Threatening Sikh Youth O-TeluguStop.com

నిందితుడు.బాధితుడి ఫేస్‌బుక్ గ్రూప్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ సిక్కు యువకుడు ఖలిస్తానీ ఉగ్రవాది అని ఆరోపిస్తూ పోస్ట్‌లు పెట్టాడు.అంతేకాకుండా అతని ఫోటోలను, ఫోన్ నెంబర్‌లను ఆన్‌లైన్‌లో వుంచాడు.ఈ కుర్రాడు భారతీయులపై విద్వేషపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాడని.

అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కామెంట్లు పెట్టేవాడు.అక్కడితో ఆగకుండా ఆ యువకుడికి పాఠాలు చెప్పేందుకు ఇంటికి వస్తానని బెదిరించేవాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా న్యూజిలాండ్ పక్కనే వున్న ఆస్ట్రేలియాలోని సిక్కు సమాజానికి చెందిన నేతలు భారతీయ- ఆస్ట్రేలియన్ సమాజంలో పెరుగుతున్న విభజనను గుర్తించారని ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది.సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశంలో గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనే ఇందుకు కారణమని పేర్కొంది.

అన్నదాతలకు కొందరు మద్ధతుగా నిలబడితే.భారత ప్రభుత్వానికి మరికొందరు బాసటగా నిలుస్తున్నారని గార్డియన్ వెల్లడించింది.

భారత్‌లోని రైతుల నిరసను సాకుగా తీసుకుని మతపరమైన మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొందరు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.గత నెలలో సిడ్నీలో నలుగురు సిక్కు విద్యార్ధులపై సాయుధులైన వ్యక్తులు దాడికి పాల్పడడ్డారు.

దీనిని ద్వేషపూరిత నేరంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Telugu Australia, Khalistani, Pop Rehana, Sikku-Telugu NRI

అటు అంతర్జాతీయ సమాజం కూడా రైతులకు బాసటగా నిలుస్తోంది.యూకే, యూఎస్, కెనడాలలోని ఎన్ఆర్ఐలు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్, ప్రముఖ పాప్ సింగర్ రెహానాలు సైతం అన్నదాతలకు మద్ధతు పలికారు.ఇటీవల బ్రిటన్ పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై చర్చ జరగడం.

దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం కెనడాలో భారతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది.

భారత ప్రభుత్వానికి అండగా నిలిచేవాళ్లు ఒకరైతే.ఖలిస్తానీ వేర్పాటు వాదులు మరో వర్గం.

ఇరు వర్గాల మధ్య స్పష్టమైన విభజన కారణంగా కెనడాలో గత కొన్ని నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.హిందూ- సిక్కు వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు గాను కొందరు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube