బ్రిటన్ లో భారత సంతతి వ్యక్తి మిస్సింగ్ కేసు చివరకు..

ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు.అయితే అలా జీవిస్తున్న భారత సంతతి ప్రజలు వేరే దేశాలలో చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ జీవిస్తున్నారు.

 Indian-origin Man Harjinder Takhar Found Dead After Missing In Uk Details, India-TeluguStop.com

కానీ ఈ మధ్యకాలంలో అమెరికాలో వరుస కాల్పులు జరుగుతున్నాయి.ఇంకా చెప్పాలంటే వేరే దేశాల్లో నివసిస్తున్న మన దేశ ప్రజలు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు.

తాజాగా బ్రిటన్ లో కనిపించకుండా పోయిన భారత సంతతి వ్యక్తి ఉదాంతం చివరకు విషాదంతో ముగిసిపోయింది.

ఇంగ్లాండ్ లోని పశ్చిమ మిడ్‌ ల్యాండ్స్‌ లో గల అడవుల్లో పోలీసులు అతడి మృతదేహాన్ని కనుక్కున్నారు.

గత సంవత్సరం అక్టోబర్ లో హర్‌ జిందర్ ఠకర్ ష్రాప్‌షైర్‌ లో టెల్‌ఫోర్డ్‌ ప్రాంతంలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.అయితే అప్పటి నుంచి కేసు నమోదు చేసుకున్న వెస్ట్ మెర్సియా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Telugu Britan, Indian Origin, International, Uk, Ukharjinder, Uk Nri-Telugu NRI

గాలింపు చర్యల్లో భాగంగా స్థానికుల సహాయం కొరగా అనేక మంది పెద్ద ఎత్తున స్పందించి గాలింపు చర్యలలో పాల్గొన్నారు.ఈ క్రమంలో స్థానికులు, హర్ జిందర్ ఫ్రెండ్స్, బంధువులు ఒక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేశారు.ఇందులో చేరిన ఎనిమిది వేల మంది హర్ జిందర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Telugu Britan, Indian Origin, International, Uk, Ukharjinder, Uk Nri-Telugu NRI

అయితే వారి ప్రయత్నాలు చివరకు విషాదంతో ముగిసిపోయాయి.హర్ జిందర్ మృతదేహం అడవుల్లో లభించినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే ఈ ఉదాందంలో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే గాలింపు చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు డిటెక్టివ్ జో వైట్‌హెడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube