సింగపూర్: మైనర్‌తో లైంగిక సంబంధం.. భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష

మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ 10 నెలల నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.పి.

 Indian-origin Man Gets Over 10 Months In Jail For Sex With Minor In Singapore ,-TeluguStop.com

అశోకన్ పప్పు పచ్చన్ (57) ఒక మైనర్‌పై సెక్స్ టాయ్‌ని ఉపయోగించి కామవాంఛ తీర్చుకోవడంతో పాటు ఆమెకు అశ్లీల చిత్రాలను పంపిన ఆరోపణలపై తన నేరాన్ని అంగీకరించాడు.ఈ రెండు అభియోగాలపై న్యాయస్థానం శిక్షను ఖరారు చేసినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా కథనాలను ప్రసారం చేసింది.

వివరాల్లోకి వెళితే.అశోకన్, 15 ఏళ్ల బాలికను ఆన్‌లైన్‌ ద్వారా కలుసుకున్నాడు.డబ్బు ఆశచూపి లైంగిక కార్యకలాపాల కోసం కలుసుకునేందుకు ఏర్పాటు చేశాడు.సెక్స్ టాయ్‌ని ఉపయోగించి తనతో లైంగిక చర్యకు సహకరించినందుకు గాను ఆమెకు 250 సింగపూర్ డాలర్లు ఇచ్చాడు.

అనంతరం బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.విచారణ సందర్భంగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా.? పాఠశాలలో చదువుతున్నావా అని న్యాయస్థానం బాధితురాలిని ప్రశ్నించగా.తాను చదువుకుంటున్నట్లు బదులిచ్చింది.

డబ్బుతో ప్రలోభపెట్టడంతో ఆయన ఆఫర్‌ను అంగీకరించినట్లు తెలిపింది.

సెప్టెంబర్ 1, 2020న బాధితురాలిని నిందితుడు కలిశాడు.

అనంతరం ఇద్దరూ రెండు హోటల్స్‌లో బస చేసేందుకు ప్రయత్నించగా.బాధితురాలికి గుర్తింపు లేకపోవడంతో రెండు చోట్లా వారికి గది లభించలేదు.

దీంతో చేసేది లేక అశోకన్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.అనంతరం ఇద్దరూ లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోయారు.

ఆ తర్వాత అమ్మాయికి డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు.మరుసటి రోజు బాలిక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu App, Indianorigin, Ashokanpappu, Singapore-Telugu NRI

దీనిపై విచారణ సందర్భంగా అశోకన్‌కు కనీసం 11 నుంచి 13 నెలల జైలు శిక్ష విధించాల్సిందిగా ప్రాసిక్యూటర్ కోర్టును కోరాడు.బాలికకు, నిందితుడికి వయసులో 41 సంవత్సరాల అంతరం వుందని.లైంగిక చర్యపై బాధితురాలికి అవగాహన లేదని ఆయన వాదించాడు.అపరిపక్వత కారణంగా ఇలాంటి కేసుల్లో మైనర్లను రక్షించడానికి చట్టం రూపొందించబడిందని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.ఈ సందర్భంగా నేరస్తుడి తరపు లాయర్ వాదిస్తూ.తన క్లయింట్ ఉద్దేశ్యపూర్వకంగా లైంగిక సంతృప్తి పొందేందుకు డేటింగ్ యాప్‌లలో మైనర్‌లను వెతకలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

నిందితుడికి ఈ ఏడాది పక్షపాతం వచ్చిందని, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ఇతర అనారోగ్యాలకు గురయ్యాడని.అందువల్ల శిక్ష విషయంలో కనికరం చూపాలని న్యాయస్థానాన్ని కోరారు.

డిసెంబర్‌లో అశోకన్‌కు జైలు శిక్ష అమలవుతుందని న్యాయమూర్తి తెలిపారు.నిందితుడు ఒంటరివాడైనందున అతని ఆస్తికి సంబంధించిన విషయాలను క్రమబద్ధీకరించుకోవచ్చని కోర్టు సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube