ఇంట్లో ఉండరా నాయనా అంటే.. డిన్నర్ కోసం హోటల్‌కి: సింగపూర్‌లో భారతీయుడికి భారీ జరిమానా

కరోనా వైరస్‌ను అత్యంత పకడ్బందీగా ఎదుర్కొన్న దేశం సింగపూర్.పక్కా ప్లానింగ్‌తో, కఠినమైన చర్యలు తీసుకుంటూ ఈ మహమ్మారి తమ దేశంలో వ్యాప్తి చెందకుండా దూకుడైన నిర్ణయాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

 Coronavirus: Indian Origin Man Fined For Breaching Stay Home Notice In Singapore-TeluguStop.com

నిబంధనలు అతిక్రమిస్తే స్వదేశీయులైనా, విదేశీయులైనా సరే ఏ మాత్రం జాలిపడటం లేదు.తాజాగా స్టే హోం నోటీసు ఉల్లంఘించినందుకు బుధవారం ఓ భారతీయుడికి భారీ జరిమానా విధించింది.

63 ఏళ్ల ధర్మనాథ్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు.దీంతో అతను దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు.

ప్రస్తుతం దేశంలో కరోనా దృష్ట్యా ఆయనను ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ.ఏప్రిల్ 6 నుంచి 10 వరకు స్టే హోం మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని వైద్యులు చెప్పారు.

Telugu Indian Origin, Singapore, Stay-

తన మంచి కోసం డాక్టర్లు చెప్పిన మాటలను ఏ మాత్రం పట్టించుకోని ధర్మనాథ్… అదే రోజు రాత్రి డిన్నర్ కోసం ఇంటి సమీపంలోని హోటల్‌కు వెళ్లాడు.స్టే హోం నోటీసు ఉన్నా అతను బయటకు వెళ్లడాన్ని గుర్తించిన స్థానికులు.అధికారులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా ఈ కేసు సింగపూర్ న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.స్టే హోం నోటీసులు థిక్కరించి బహిరంగ ప్రదేశానికి వెళ్లినందుకు గాను ధర్మనాథ్ సింగ్‌కు న్యాయమూర్తి 5 వేల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.2,73,109) జరిమానా విధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube