భారతీయుడిపై ఎనిమిది మంది దాడి, మృతి : 17 ఏళ్ల నాటి కేసును తవ్వుతున్న యూకే  

Indian Origin Man Dies Years After Assault In Uk -

దాదాపు 17 సంవత్సరాల క్రితం పశ్చిమ లండన్‌లో ఎనిమిది మంది కలిసి ఓ భారతీయుడిని దాడి చేసి చంపిన ఘటనపై స్కాట్‌లాండ్ యార్డ్ డిటెక్టివ్‌లు బుధవారం విచారణ ప్రారంభించారు.

 Indian Origin Man Dies Years After Assault In Uk

2003 ఆగస్టులో ఆక్టాన్ పార్క్ వద్ద జరిగిన దాడిలో 42 ఏళ్ల వర్మకు మెదడుకు తీవ్రగాయాలవ్వడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు.అయితే అనేక కత్తిపోట్లు, మొదడుకు గాయాలు ఉండటంతో ఆయనను అనేక అరోగ్య సమస్యలు వెంటాడాయి.దాదాపు 15 ఏళ్ల తర్వాత రాజేశ్ 2018 మే లో మరణించాడు.

ఈ వారం, ఈ కేసును హత్యగా నిర్థారించి, మెట్రోపాలిటన్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్‌కు చెందిన డిటెక్టివ్‌లు విచారణ చేస్తున్నారు.ఆ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిన వారికి 20,000 పౌండ్ల రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

భారతీయుడిపై ఎనిమిది మంది దాడి, మృతి : 17 ఏళ్ల నాటి కేసును తవ్వుతున్న యూకే-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఆ రోజున రాజేశ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసి దగ్గరలోని పార్క్‌లో అతని తలపై పొడిచి చంపినట్లు మెట్ పోలీస్ విభాగం తెలిపింది.తన స్నేహితులలో ఓ వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య జరిగిన వివాదంలో రాజేశ్ జోక్యం చేసుకున్న తర్వాత అతనిపై దాడి జరిగిందని మెటో పోలీసులు వెల్లడించారు.నిందితులంతా తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది.వారంతా ఇప్పటికీ అక్కడ నివసించకపోయినా, స్థానికులతో వారికి సంబంధాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.2015లో వర్మకు గుండెపోటు వచ్చింది.దీని ఫలితంగా అతని మెదడులో ఆక్సిజన్ నిలిచిపోవడం వల్ల ఆయన చనిపోయారు.

దాడి జరిగిన తర్వాత సుమారు 18 నెలల పాటు అతను కదల్లేక, మాట్లాడలేకపోయారు.శరీరంపై కత్తిపోట్ల కారణంగా రాజేశ్ వర్మ మూర్చ వ్యాధికి సైతం గురయ్యారు.

మరణించిన తర్వాత పాథాలజిస్ట్ చేత 2018 జూన్‌లో జరిగిన ప్రత్యేక పోస్ట్‌మార్టంలో దాడి కారణంగానే అతని హత్య జరిగిందని తేలింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు