యూకే జైలులో భారత సంతతి ఖైదీ అనుమానాస్పద మృతి: తోటి ఖైదీలపై అనుమానం

ఈ నెల ప్రారంభంలో యూకే జైలులో తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో పడివున్న భారత సంతతి ఖైదీ మరణించినట్లు స్కాట్‌లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

 Indian Origin Man Dies Of Head Injuries In Uk Prison-TeluguStop.com

ఫిబ్రవరి 18న ఆగ్నేయ లండన్‌లోని హై సెక్యూరిటీ జైలు కాంప్లెక్స్ అయిన బెల్మార్ష్ హర్ మెజెస్టి జైలు (హెచ్ఎంపీ)లో సందీప్ ఘుమాన్ అనే భారతీయ ఖైదీ తీవ్ర గాయాలతో పడివున్నాడు.

సమాచారం అందుకున్న అధికారులు, లండన్ అంబులెన్స్ సర్వీస్ జైలు వద్దకు చేరుకుని ఘుమన్‌ను ఆసుపత్రికి తరలించారు.ఆ మరుసటి రోజే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

గత శుక్రవారం లండన్‌లోని గ్రీన్‌విచ్ మార్చురీలో సందీప్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.తలకు గాయం కావడం వల్లే అతను మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది.అదే జైలులో ఘుమన్‌తో కలిసి శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఖైదీలు అతనిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మెట్ పోలీసులు పేర్కొన్నారు.జైలు అధికారులు, స్థానిక పోలీసుల సాయంతో ఈ ఘటనకు దారి తీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు మెట్స్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ తెలిపింది.

Telugu Belmarsh, Greenwich, Indian Origin, Indianorigin, London, Prison, Sandeep

బెల్మార్ష్ జైలులో యూకేలోనే అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఉంచుతారు.ఇటీవలి తనిఖీ నివేదికల్లో భాగంగా ఈ జైలులో ఖైదీల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో సందీప్ ఇదే జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube