అమెరికాలో భారతీయుడి అరెస్ట్..కారణం తెలిస్తే మైండ్ బ్లాకే..!!

ఎంతోమంది భారతీయులు అగ్ర రాజ్యం అమెరికాలో స్థిరపడి ఎంతో ఉన్నత స్థానంలో కొలువుదీరుతూ ఉంటారు.మరో కొందరు సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు.

 Indian Origin Man Arrested , Loan, Fake Companies, Loan On Fake Companies, Ameri-TeluguStop.com

అయితే కొందరు మాత్రం డబ్బు ఈజీగా సంపాదించాలనే కోరికతో అడ్డ దారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోతున్నారు.ఇదే తరహాలో ఓ భారతీయ అమెరికన్ అమెరికా పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు.

తానొకటి అనుకుంటే అమెరికా పోలీసులు మరొకటి తలచారు.ఇంతకీ ఏమి జరిగిందంటే.

కరోన దెబ్బకి కకలావికలం అయిన అమెరికాలో ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టింది.ఈ చర్యలలో భాగంగా పలు కంపెనీలు ఈ ఉద్దీపన ప్యాకేజీ ని అందుకోవడానికి ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకున్నాయి.

ఈ ప్యాకేజీ పేరు “పే చెక్ ప్రొటక్షన్ ప్రోగ్రామ్” అయితే ఈ ప్రాకేజీ పై కన్నేసిన ఓ భారత సంతతికి చెందిన ముకుంద్ మోహన్ అనే వ్యక్తి అందుకు తగ్గట్టుగా భారీ స్కెచ్ సిద్దం చేసుకుని ప్రభుత్వానికి వినతిని పెట్టుకున్నాడు.గతంలో పలు కీలక కంపెనీలలో కీలక శాఖలు అధిరోచిన ముకుంద్ పక్కా ప్లాన్ తో ప్రభుత్వ సొమ్ము కాజేయాలని అనుకున్నాడు…

ఈ క్రమంలోనే ఆరు షెల్ కంపెనీల పేర్లతో ఎనిమిది రకాల లోన్లకి ధరఖాస్తు చేశాడు.

ఈ అన్ని కంపెనీలలో ఉన్న తన ఉద్యోగులు అందరికి జీతాలు చెల్లించేందుకు గాను తనకి 2.౩ మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యిందని అందుకుగాను ఈ లోన్లు మంజూరు చేసి తనని ఆదుకోవాలని, నేను వీటికి అర్హుడిని అంటూ ప్రభుత్వాన్ని కోరాడు.

అయితే అతడి ఆర్జీపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరుపగా అవన్నీ బోగస్ కంపెనీలుగా తేలాయి.దాంతో ముకుంద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోందని విచారణ పూర్తి కాగానే కోర్టు ముందు ప్రవేశ పెడుతామని తెలిపారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube