భారత సంతతికి చెందిన మజూ వర్గీస్ .అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు షాకిచ్చారు.
వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పోస్ట్‌కు ఆయన రాజీనామా చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.‘‘ప్రస్తుతం.
తాను, తన కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నిస్తానని వర్గీస్ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించే తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది.వైట్‌హౌస్‌లో వైద్య సహాయం, అత్యవసర వైద్య సేవలు, అధ్యక్షుడి ప్రయాణాలు, కమ్యూనికేషన్లు, అధికారిక వేడుకల కోసం సైన్యంతో కలిసి పనిచేయడం వర్గీస్ విధి.
సంక్లిష్టమైన కదలికలు, హెలికాఫ్టర్లు, విమానాలు, భూ రవాణా, కమ్యూనికేషన్లు, పెద్ద పెద్ద ఈవెంట్లకు మద్ధతుగా వుండటం వంటి పనులు వేటికవే కష్టమైనవని మజూ వర్గీస్ సీఎన్ఎన్తో అన్నారు.
కాగా.
కేరళలోని తిరువల్లకు చెందిన మజూ వర్గీస్ తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే అమెరికాకు వలస వెళ్లారు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేశారు వర్గీస్.2015 నుంచి 2017 వరకు నిర్వహణ, పరిపాలనా విభాగాల్లో అధ్యక్షుడికి సహాయకుడిగా పనిచేశారు.ఆ సమయంలో వైట్‌హౌస్ బడ్జెట్, సిబ్బంది, సౌకర్యాలు, పర్యటనలు, ప్రధాన కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు వైట్‌హౌస్ కాంప్లెక్స్ రోజువారీ కార్యకలాపాలను వర్గీస్ పర్యవేక్షించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన వర్గీస్ 2020లో బైడెన్ – హారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, సీనియర్ అడ్వైజర్‌గా సేవలందించారు.కరోనా విజృంభణ, క్యాపిటల్ భవనంపై దాడులు వంటి విపత్కర పరిస్ధితుల్లో బైడెన్- హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరగడం వెనుక వర్గీస్ కీలకపాత్ర పోషించారు.ఈ క్రమంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత .మజూ వర్గీస్‌ను వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ చీఫ్‌గా నియమిస్తూ.గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేశారు.
వైట్‌హౌస్ మిలటరీ కార్యాలయం .అక్కడ జరిగే పలు అధికారిక వేడుకలు, వైద్య సదుపాయం, అత్యవసర సేవలు, అధ్యక్షుని ప్రయాణాలు వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది.అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాల పర్యటనకు వెళ్లేందుకు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్-వన్.
డైరెక్టరు కనుసన్నల్లోనే ఉంటుంది.వర్గీస్ వీటన్నింటికీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.