యూకే: షాడో ఫారిన్ సెక్రటరిగా భారత సంతతి ఎంపీ లీసా నంది  

Indian Origin Lisa Nandy Uk Shadow Foreign Secretary - Telugu Boris Johnson, Government, Kair Starmer, Labour Party, Opposition Leader, Prime Minister, Shadow Cabinet

లేబర్ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకునే క్రమంలో సర్ కైర్ స్టార్మెర్ చేతిలో ఓటమి పాలైన భారత సంతతి మహిళా నేత లీసా నంది బ్రిటన్ షాడో ఫారిన్ సెక్రటరీగా నియమితులయ్యారు.లేబర్ పార్టీకి కొత్త అధినేతగా ఎంపికైన సర్ కైర్ స్టార్మెర్ తన షాడో మంత్రివర్గం ద్వారా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తారు.

 Indian Origin Lisa Nandy Uk Shadow Foreign Secretary

40 ఏళ్ల లీసా నంది విగాన్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.లేబర్ పార్టీ మాజీ నేత జెరెమీ కార్బిన్ షాడో క్యాబినెట్‌లో ఫారిన్ సెక్రటరీగా ఉన్న ఎమిలి థోర్న్ బెర్రీ స్థానంలో లీసా నియమితులయ్యారు.

పార్టీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే స్టార్‌మెర్ తన టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటూ, కార్బిన్ మద్ధతు దారులను కీలక పదవుల నుంచి తప్పిస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై షాడో కేబినెట్ పనిచేస్తుందని స్టార్మెర్ చెప్పారు.

యూకే: షాడో ఫారిన్ సెక్రటరిగా భారత సంతతి ఎంపీ లీసా నంది-Telugu NRI-Telugu Tollywood Photo Image

సీ-19 అని పిలవబడే కమిటీలో స్టార్మెర్ ( ప్రతిపక్షనేత), ఏంజెలా రేనర్ (డిప్యూటీ లీడర్), అన్నెలీ డాడ్స్ (షాడో ఛాన్సెలర్), లీసా నంది ( షాడో ఫారిన్ సెక్రటరీ), నిక్ థామస్ సైమండ్స్ (షాడో హోమ్ సెక్రటరీ), రాచెల్ రీవ్స్ (లాంకాస్టర్ డచీ షాడో ఛాన్సలర్), జోనాథన్ అష్వర్త్ ( షాడో హెల్త్ సెక్రటరీ) ఉన్నారు.ప్రస్తుతం దేశ ప్రజలు అత్యవసర పరిస్ధితుల మధ్య జీవిస్తున్నామని, తన నాయకత్వంలో లేబర్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాణాలను కాపాడటానికి, జీవనోపాధిని అందించడానికి శ్రమిస్తుందని లేబర్ పార్టీ చీఫ్ సర్ కైర్ స్టార్మెర్ అన్నారు.తన షాడో కేబినెట్ ప్రథమ ప్రాధాన్యత దేశ శ్రేయస్సేనని ఆయన స్పష్టం చేశారు.తాము ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వడంతో పాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్టార్మెర్ చెప్పారు.

తనను షాడో ఫారిన్ సెక్రటరీగా నియమించినందుకు గాను స్టార్మెర్‌కు లీసా ధన్యవాదాలు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో లేబర్ పార్టీ విదేశా విధానానికి నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

లేబర్ పార్టీ చీఫ్‌ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సర్ కైర్ స్టార్మెర్ విజయం సాధించగా.లీసా నంది మూడవ స్థానంలో నిలిచారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Lisa Nandy Uk Shadow Foreign Secretary Related Telugu News,Photos/Pics,Images..