అమెరికా: ఆసియా - పసిఫిక్ సబ్‌కమిటీ పగ్గాలు మళ్లీ అమీబేరాకే..!!

ఆసియా, పసిఫిక్, మధ్యాసియా విధానాలకు సంబంధించి కీలకపాత్ర పోషిస్తున్న యూస్ కాంగ్రెస్ ఉపసంఘం అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీబేరా మరోసారి ఎన్నికయ్యారు. 55 ఏళ్ల అమీ బేరా అమెరికా ప్రతినిధుల సభలో సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండో అమెరికన్‌గా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.

 Indian-origin Lawmaker Ami Bera, Re-elected Chairman Of Subcommittee On Asia Pac-TeluguStop.com

ఈ సబ్ కమిటీకి ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికవ్వడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అమీబేరా ఓ ప్రకటనలో తెలిపారు.మన ఆర్ధిక వ్యవస్థ, జాతీయ భద్రతతో అంతర్గతంగా ఈ ప్రాంతాలు ముడిపడి వున్నందున అమెరికా విదేశాంగ విధానానికి ఆసియా అత్యంత కీలకంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
చైనా, ఉత్తర కొరియా నుంచి ఈ ప్రాంతమంతటా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘన వంటి కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అనేక సవాళ్లు వున్నాయని అమీబేరా చెప్పారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించడానికి ఆసియా, పసిఫిక్‌లోని తమ పొత్తులను పునర్నిర్మించడానికి బైడెన్ యంత్రాంగంతో తన సహచరులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని అమీబేరా వెల్లడించారు.

Telugu Ami Bera, Asia Pacific, Congressmanami, Indianorigin-Telugu NRI

ఈ ఉపసంఘంలో డెమొక్రాట్ సభ్యులు బ్రాడ్ షెర్మాన్, దినా టైటస్, ఆండీ లెవిన్, క్రిస్సీ హౌలహాన్, ఆండీ కిమ్, జెర్రీ కొన్నోల్లి, టెడ్ లియు, అబిగైల్ స్పాన్‌బర్గర్, కాథీ మన్నింగ్ వున్నారు.అమీబేరా ఆఫ్రికా, గ్లోబల్ హెల్త్, గ్లోబల్ హ్యూమన్ రైట్స్‌పై హౌస్ ఫారిన్ సబ్ ‌కమిటీలోనూ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.అంతేకాకుండా కొరియాపై కాంగ్రెషనల్ కాకస్‌ కో చైర్‌గా కూడా పనిచేస్తున్నారు.గతంలో ఇండియా, ఇండో అమెరికన్లపై కాంగ్రెస్ కాకస్‌కు అధ్యక్షత వహించారు.
గుజరాత్‌కు చెందిన బేరా తల్లిదండ్రులు 1958లో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు.లాస్ ఏంజెల్స్‌లో జన్మించిన ఆయన ఆరంజ్ కౌంటీలోని లా పామాలో పెరిగారు.

జాన్ ఎఫ్ కెనడీ హైస్కూల్‌లో చదువుకున్నారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బయోలాజికల్ సైన్సెస్ నుంచి డిగ్రీ పట్టా పొందారు.1991లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అభ్యసించారు.అనంతర కాలంలో కౌంటీ ఆఫ్ శాక్రమెంటోకి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా అమీబేరా వ్యవహరించారు.

తర్వాత యూసీ డేవీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు అడ్మిషన్ల విభాగంలో డీన్‌గా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube