ఇంట్లో ఉండమని నోటీసు.. కాదని పనికి వెళ్లినందుకు: సింగపూర్‌లో భారతీయుడికి జైలు

కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే చాలా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అక్కడి అధికారులు భారీ జరిమానాలు విధించాయి.

 Indian-origin Man In Singapore Gets Jail Term For Breaching Stay-home Notice, St-TeluguStop.com

నేర తీవ్రతను బట్టి మరికొందరిని జైలుకు సైతం పంపింది.సింగపూర్‌లో ఈ తరహా ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయులు శిక్షను ఎదుర్కొన్నారు.

తాజాగా మరో భారతీయుడు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు.

ఖురేష్ సింగ్ సంధు అనే భారతీయుడు సింగపూర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అతను మార్చి 17న ఇండోనేషియాలోని బాటం నుంచి సింగపూర్ వచ్చాడు.దీంతో అధికారులు నిబంధనల ప్రకారం అతనిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలంటూ స్టే హోమ్ నోటీసు ఇచ్చారు.

దీని ప్రకారం మార్చి 17 నుంచి మార్చి 31 వరకు 14 రోజుల పాటు ఇంటి దాటి గడప దాటకూడదు.అయినప్పటికీ సంధు తన విధులకు హాజరవ్వడంతో పాటు ఇతరులతో కలిసే ఉంటున్నాడు.

Telugu Quarantine, Indianorigin, Jail Term, Singapore, Stay-

ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేసిన తర్వాత అతను నేరుగా సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరేందుకు వెళ్లి, అదే రోజు రాత్రి 8 గంటలకు డ్యూటీ ప్రారంభించాడు.ఆ తర్వాత రోజు ఉదయం తన విధులను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రైలెక్కి.లిటిల్ ఇండియా ఆవరణలోని డన్‌లాప్ స్ట్రీట్‌లో వున్న గదికి చేరుకున్నాడు.అయితే తాను విదేశాల నుంచి వచ్చానని.అధికారులు స్టే హోమ్‌లో ఉండమని చెప్పారన్న విషయాలను దాచిపెట్టి, మూడు రోజుల పాటు విధులకు హాజరయ్యాడు.

మార్చి 21న సంధు సూపర్‌వైజర్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

ఇంతలో ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్స్ అథారిటీ అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా.అక్కడ ఖురేష్ కనిపించలేదు.

దీంతో అధికారులు అతనిపై కేసు నమోదు చేయడంతో సంధు తన నేరాన్ని అంగీకరించాడు.ఇతరుల ప్రాణాలకు హానీ కలిగించేలా వ్యవహరించినందుకు ఖురేశ్‌కు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల డాలర్ల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube