అమెరికా: వ్యాధి నిరోధకతపై ప్రయోగాలు.. భారత సంతతి ఇమ్యూనాల‌జిస్ట్‌ అరుదైన గౌరవం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్నారు.

 Indian Origin Immunologist Sankar Ghosh Elected To National Academy Of Sciences-TeluguStop.com

తాజాగా అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన ఇమ్యూనాల‌జిస్ట్ శంక‌ర్ ఘోష్ ప‌రిశోధ‌న రంగంలో ప్ర‌తిష్టాత్మ‌క నేష‌న‌ల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎంపిక‌య్యారు.ఘోష్ కొలంబియా యూనివ‌ర్సిటీ అనుబంధ వెగీలాస్ కాలేజ్ మైక్రోబ‌యాల‌జీ, ఇమ్యూనాల‌జీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ప‌నిచేస్తున్నారు.

అకాడ‌మీ గ‌త వారం ప్ర‌క‌టించిన 120 మందితో ప్రకటించిన కొత్త స‌భ్యుల్లో ఘోష్ ఒక‌రు.

 Indian Origin Immunologist Sankar Ghosh Elected To National Academy Of Sciences-అమెరికా: వ్యాధి నిరోధకతపై ప్రయోగాలు.. భారత సంతతి ఇమ్యూనాల‌జిస్ట్‌ అరుదైన గౌరవం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్యాన్స‌ర్ నుంచి డయాబెటిస్ వ‌ర‌కూ రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు, వ్యాధుల‌కు మ‌ధ్య ఉన్న సంబంధంపై ఘోష్ ఎన్నో పరిశోధనలు సాగించారు.అలాగే మానవ శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్, ప‌లు వ్యాధుల‌కు దారితీసే పాథ‌లాజిక‌ల్ మార్పుల గుట్టును చేధించేందుకు ఘోష్ కృషి చేశారు.2008లో కొలంబియా వ‌ర్సిటీలో చేరిన శంక‌ర్ ఘోష్ గతంలో హావ‌ర్డ్ హ్యూస్ మెడిక‌ల్ ఇనిస్టిట్యూట్‌లో ఇన్వెస్టిగేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.అమెరిక‌న్ అసోసియేష‌న్ ఫ‌ర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్‌లోనూ ఫెలోగా విధులు నిర్వర్తించారు.కాగా లాభాపేక్షలేని వ్యవస్థగా సైన్స్, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కాంగ్రెషనల్ చార్టర్ ద్వారా 1863లో ఏర్పాటు చేశారు.

ఈ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి అమెరికా ప్రభుత్వానికి సైన్స్, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగాల్లో సలహాలు, సూచనలు అందిస్తుంది.

కోల్‌కతాకు చెందిన శంకర్ ఘోష్.

కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎంఎస్సీ డిగ్రీలను అందుకున్నారు.అనంతరం అమెరికాలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుంచి మాలిక్యూలర్ బయోలాజీలో పీహెచ్‌డీ చేశారు.

యేల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌లో ఇండిపెండెంట్ రీసెర్చర్‌గా శంకర్ కెరీర్ మొదలైంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు