అప్పట్లో హాట్ మెయిల్‌తో సంచలనం.. ఇప్పుడు ‘‘ షో రీల్‌ ’’ తో వస్తున్న భారత సంతతి టెక్కీ

90వ దశకంలో జన్మించిన వారు బాగా ఉపయోగించిన ఈమెయిల్స్‌లో ‘‘హాట్ మెయిల్’’ ఒకటి.ఈ.

 Indian Origin Hotmail Founder Sabeer Bhatia Launches Short Videos Platform Showr-TeluguStop.com

ఈమెయిల్ సర్వీస్‌ను తొలిసారిగా భారత సంతతికి చెందిన టెక్కీ సబీర్ భాటియా ప్రారంభించారు.అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హాట్ మెయిల్‌ను 1997లో దాదాపు 400 మిలియన్లకు మైక్రోసాఫ్ట్‌కు విక్రయించారు.

ఆ సమయంలో కార్పోరేట్ ప్రపంచం ఈ డీల్‌తో ముక్కున వేలేసుకుంది.

హాట్ మెయిల్ తర్వాత సబీర్ భాటియా.Arzoo.com వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఈ కామర్స్‌లోకి ప్రవేశించారు.దీనితో పాటు సబ్ సే టెక్నాలజీస్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) సేవలను అందించారు.అనంతర కాలంలో ఈ రెండింటిని మూసివేశారు.తర్వాత తన బుర్రకు పదునుపెట్టిన భాటియా.

ఇప్పుడు కొత్తగా షార్ట్ వీడియో ఫ్లాట్‌ఫామ్‌ ‘‘ ShowReel ’’ను ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్యం పెంచే అవకాశాలను అందించడమే లక్ష్యంగా భాటియా ShowReel‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రపంచంలోని మొట్టమొదటి ఈ మెయిల్ సేవలలో ఒకటైన హాట్ మెయిల్‌ను మైక్రోసాఫ్ట్‌కు 400 మిలియన్ డాలర్లకు విక్రయించిన తర్వాత టెక్ పరిశ్రమకు భాటియా పోస్టర్ బాయ్‌గా మారారు.ప్రస్తుత ‘‘షో రీల్ ’’ విషయానికి వస్తే.

ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచం.వినోదం పంచడంతో పాటు తోటి వ్యక్తి గురించి తెలుసుకోవడం, ప్రొఫెషనల్ వీడియోలు పంచుకోవడం వంటివి చేసుకోవచ్చు.

Telugu Arzoocom, Google Store, Hot Mail, Indianorigin, Microsoft, Sabeer, Show R

ప్రస్తుతం ‘‘షో రీల్ ’’ బీటా మోడ్‌లో పనిచేస్తోంది.కొత్త తరం ప్రతిభను కనుగొనడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కంపెనీలకు ఈ ఫ్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది.దీని సాయంతో నిరుద్యోగులు, మెంటార్‌లు, రిక్రూటర్లు అడిగే ప్రశ్నలకు ప్రతిస్పందనగా యూజర్లు ఎవరికి వారు స్వంతంగా ప్రొఫెషనల్ వీడియోలను రూపొందించుకోవచ్చు.దీని వల్ల నిరుద్యోగులు తమను తాము మార్కెటింగ్ చేసుకోవడానికి , వారి డ్రీమ్ జాబ్స్‌ను పొందవచ్చని సబీర్ భాటియా చెప్పారు.

ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదని ఆయన అన్నారు.భారతదేశానికి చెందిన 20 మందితో కూడిన బృందం ‘‘షో రీల్’’ను రూపొందించారని భాటియా చెప్పారు.

యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో వుందని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube