బ్రిటన్ ఒక్క రోజు దౌత్య అధికారిగా...భారతీయ విద్యార్ధిని...

ఒక్క రోజు సిఏం అనగానే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గుర్తుకు వస్తాడు కదా.ఈ సినిమా తరువాత కొన్ని వ్యవస్థలలో మార్పులు చాలానే చోటు చేసుకున్నాయి.

 Indian Origin Girl Takes Charge Of British High Commission For A Day, British Di-TeluguStop.com

ముఖ్యంగా విద్యార్ధులను ప్రోశ్చహించడం కోసమో, వారి కలలకు తగ్గట్టుగా మరింత దృడమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసమో పలు ప్రభుత్వ రంగాలు ఒక్క రోజు అధికారులుగా వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి.ఈ విధానం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా భారత్ లోని బ్రిటన్ దౌత్య కార్యాలయం బాలిక దినోత్సవం సందర్భంగా హై కమిషనర్ ఆఫ్ ది డే అనే పోటీను నిర్వహించింది.వివరాలలోకి వెళ్తే.

భారత్ లోని బ్రిటన్ దౌత్య కార్యాలయం నిర్వహించిన హై కమిషనర్ ఆఫ్ ది డే అనే పోటీలో రాజస్థాన్ కు చెందిన అతిదీ మహేశ్వరీ విజయం సాధించింది.దాంతో ఒక రోజు బ్రిటన్ దౌత్య అధికారిగా సేవలు అందించింది.

ఈ క్రమంలో అతిది దౌత్య సంభందిత వ్యవహారాలు, అధికారిగా విధులు, భాద్యతలు ఎలా ఉంటాయో తెలుసుకుంది.అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ చురుకుగా వ్యవహరించిన అతిది ఎన్నో విషయాలను నేర్చుకున్నట్టుగా తెలిపారు.

దౌత్య అధికారులతో సమావేశం, మహిళా టీమ్స్ తో మాట్లాడటం, వారితో మమేకం అవ్వడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఆమె తెలిపింది.ఢిల్లీ యూనివర్సిటీ లోని మిరాండా కాలేజే లో డిగ్రీ చదువుతున్న అతిధి తనకు ఐఏఎస్ అవడం ప్రధానమైన కలని, ఆ దిశగానే తాను కష్టపడుతున్నానని ప్రకటించింది.

బ్రిటన్ దౌత్య అధికారిగా ఒక్క రోజు పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, కార్యాలయ అధికారులు తనకు ఎంతో ధైర్యం చెప్పారని, భవిష్యత్తులో ఐఏఎస్ అయ్యి భారత ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube