బ్రిటన్ గాట్ టాలెంట్ 2020: దుమ్మురేపుతున్న పదేళ్ల భారత సంతతి బాలిక  

10 year old Indian-origin girl among semi-finalists of Britain\'s Got Talent 2020, Britain\'s Got Talent 2020, Indian Origin Girl Souparnika Nair - Telugu Britain\\'s Got Talent 2020, Indian Origin Girl Souparnika Nair, Semi Finals, Semi-finalists Of Britain\\'s Got Talent 2020, Shashi Taroor

బ్రిటన్‌లో జరుగుతున్న గాట్ టాలెంట్ 2020లో పదేళ్ల భారతీయ బాలిక సౌపర్ణిక నాయర్ తన గానామృతంతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్‌కు ఎంపికైంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ సైతం ఈ చిన్నారి గాత్రానికి ఫిదా అయిపోయారు.

 Indian Origin Girl Semi Finals Britain Got Talent 2020

ఆమెకు మద్ధతు పలుకుతూ బాలికకు వోటు వేయాల్సిందిగా బ్రిటిష్ ఇండియన్ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.బరీ సెయింట్ ఎడ్మండ్స్‌లో సౌపర్ణిక తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.
ఈ టాలెంట్ షోకు సంబంధించి ఆడిషన్ చేస్తున్నప్పుడే ఆమె తన సత్తా ఏంటో చూపించింది.గాట్ టాలెంట్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఆష్లే బాంజో, అమండా హోల్డెన్, డేవిడ్ విలియమ్స్, అలెషా డిక్సన్ సెమీఫైనల్లో సౌపర్ణిక ఆలపించిన ‘‘ నెవర్ ల్యాండ్‌ ’’ పాటకు ఫిదా అయ్యారు.

దీనిపై ఆ బాలిక స్పందిస్తూ.తాను చిన్నప్పటి నుంచి బ్రిటన్ గాట్ టాలెంట్‌ను చూస్తున్నానని.అలాంటి సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా తన కల నెరవేరిందని చెప్పింది.

బ్రిటన్ గాట్ టాలెంట్ 2020: దుమ్మురేపుతున్న పదేళ్ల భారత సంతతి బాలిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతకుముందు మే నెలలో జరిగిన ఆడిషన్ సందర్భంగా ట్రాలీ సాంగ్ పాటను సౌపర్ణిక పాడటం ప్రారంభించింది.అయితే మధ్యలోనే కలగజేసుకున్న న్యాయమూర్తి సైమన్ కోవెల్ ఆ పాట తనకు ఇష్టం లేదని.దానికి బదులుగా ది గ్రేటెస్ట్ షోమాన్ చిత్రంలోని ఏదైనా పాటను పాడాల్సిందిగా కోరాడు.

కాగా తాజా ఎడిషన్‌లో సౌపర్నికా పాడిన ‘‘ నెవర్ ఎనఫ్’’ పాటకు న్యాయమూర్తుల ప్రశంసలు అందుకుంది.జడ్జి అమన్డా హోల్డెన్ సౌపర్ణిక ఓల్డ్ ఫ్యాషన్డ్ వాయిస్‌ను ఇష్టపడుతున్నానని అన్నారు.

సౌపర్ణికకు కేవలం పదేళ్లంటే తాను నమ్మలేకపోతున్నానని మరో జడ్జి అలెషా డిక్సన్ ఆశ్చర్యపోయారు.తద్వారా సౌపర్ణిక జడ్జిల నుంచి నాలుగు ‘యస్’ ఓట్లను అందుకున్నారు.

#Shashi Taroor #IndianOrigin #Britain'sGot #Semi Finals

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Girl Semi Finals Britain Got Talent 2020 Related Telugu News,Photos/Pics,Images..