పెద్దలకు స్పూర్తి: యూకేలో భారత సంతతి బాలికపై ప్రశంసల వర్షం  

Indian-Origin Girl Reunites Man With Wedding Ring Lost On UK Beach, UK Beach, Indian-Origin Girl, Priya, Mat East, Golden Finger Ring, Wedding Ring - Telugu Golden Finger Ring, Indian-origin Girl, Mat East, Priya, Uk Beach, Wedding Ring

రోడ్డు మీద పది రూపాయల నోటు కనిపిస్తేనే దానిని ఎవరికీ కనిపించకుండా సైలెంట్‌గా జేబులోకి తోసేస్తాం.ఎవరైనా దానిని గమనిస్తే అది నాదేనని దబాయిస్తాం.అలాంటిది విలువైన ఉంగరం దొరికితే అసలు ఇంకేమైనా ఉందా.? చటుక్కున దానిని పట్టేసి ఇంటికి పరిగెడతాం.కానీ ఓ బాలిక మాత్రం ఆ ఉంగరం పొగొట్టుకున్న వ్యక్తికి దానిని అప్పగించి తన పెద్ద మనసు చాటుకుంది.

TeluguStop.com - Indian Origin Girl Reunites Man With Wedding Ring Lost On Uk Beach

ప్రియా సాహూ అనే 11 ఏళ్ల భారత సంతతి బాలిక ఇంగ్లాండ్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తోంది.

ఈ క్రమంలో గత నెలలో ఫ్యామిలీతో కలిసి వెంట్నోర్ బీచ్‌కు వెళ్లింది.బీచ్‌లో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారికి ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది.అది ఏమై ఉంటుందోనన్న కుతుహలంతో దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ బంగారు ఉంగరం.దానిని తీసుకుని వెంటనే తన తల్లి అశ్వితా దగ్గరకి పరిగెత్తుకెళ్లి చూపించింది.

TeluguStop.com - పెద్దలకు స్పూర్తి: యూకేలో భారత సంతతి బాలికపై ప్రశంసల వర్షం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే దీనిని పొగొట్టుకున్న వ్యక్తి ఉంగరం కోసం ఎంతగా బాధపడుతున్నాడోనని ఆ పసిమనసుకి తోచింది.అంతే దానిని అతని దగ్గరికి చేర్చాలని నిర్ణయించుకుని తల్లితో చెప్పింది ప్రియా.

ఉంగరం పొగొట్టుకున్న మాట్ ఈస్టీ అనే వ్యక్తి ప్రతిరోజూ కొన్ని గంటల పాటు బీచ్‌లో వెతికేవాడు.కానీ ఉంగరం ఎంతకు దొరకకపోవడంతో దానిపై ఆశలు వదులుకున్నాడు.

అయితే బీచ్ దగ్గరలోని ఓ కేఫ్ షాప్ ఓనర్‌తో తన ఉంగరం పోయిన విషయాన్ని చెప్పి, ఎవరికైనా దొరికితే తన గురించి చెప్పాలని విజ్ఞప్తి చేశాడు.

ఈ నేపథ్యంలో తనకు దొరికిన ఉంగరాన్ని ప్రియ తన తల్లితో కలిసి ఆ కేఫ్ యజమాని దగ్గరకు తీసుకెళ్లింది.

దీంతో ఆయన మాట్ ఈస్టీ గురించి వారికి చెప్పాడు.ఆ వెంటనే ప్రియా తల్లి అశ్విత.

మీ ఉంగరం తమకు దొరికిందనే విషయాన్ని మాట్‌కు తెలియజేశారు.అనంతరం ఆ వెడ్డింగ్ రింగ్‌ను కేఫ్ యజమానికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక జీవితంలో దొరకదు అనుకున్న ఉంగరం మళ్లీ తన చెంతకు చేరడంతో మాట్ ఉబ్బితబ్బి బ్బవుతున్నాడు.తనకు సాయం చేసిన చిన్నారి ప్రియా, ఆమె తల్లి అశ్వితాకు ధన్యవాదాలు తెలియజేశాడు.

ఈ విషయం ఆ వూళ్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో పాప పెద్ద మనసును ప్రశంసిస్తున్నారు.

#Priya #Wedding Ring #UK Beach #Mat East

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Girl Reunites Man With Wedding Ring Lost On Uk Beach Related Telugu News,Photos/Pics,Images..