అమెరికన్ కార్పోరేట్ రంగంలో కలకలం: జనరల్ మోటార్స్‌కు దివ్యా సూర్యదేవర రాజీనామా

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కో సీఎఫ్‌వో పదవికి భారత సంతతికి చెందిన దివ్యా సూర్యదేవర రాజీనామా చేశారు.ఇందుకు సంబంధించి ‘‘ ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ’’ కథనాన్ని ప్రచురించింది.

 Indian Origin General Motors' Cfo Dhivya Suryadevara Resigns To Join Fintech Sta-TeluguStop.com

ఆమె రాజీనామాను జనరల్ మోటార్స్ కూడా ధ్రువీకరించినట్లు పేర్కొంది.ఆమె స్థానంలో జీఎం ఉత్తర అమెరికా విభాగానికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జాన్ స్టాప్లిటన్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మరొకరిని ఈ పదవిలో నియమించే వరకు జాన్ విధులు నిర్వహిస్తారు.

మరోవైపు జనరల్ మోటార్స్ నుంచి తప్పుకున్నాకా దివ్య శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆన్‌లైన్ కామర్స్ సంస్థ స్ట్రిప్ ఐఎన్‌సీలో చేరుతున్నారు.

మరోవైపు ఆమె రాజీనామా అమెరికన్ ఆటోమొబైల్ రంగంలో కలకలం రేపింది.తన రాజీనామా విషయంపై దివ్య స్పందించారు.‘‘ తాను పెద్ద వ్యాపార సంస్థలో పనిచేయడాన్ని ఆస్వాదించానని.తన అనుభవాన్ని, తెలివి తేటలను స్టార్టప్‌లను అభివృద్ది చేయడానికి వినియోగించాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Telugu America, American Auto, Chennai, General Motors, Wallstreet-

భారతదేశంలోని చెన్నైకి చెందిన దివ్యా సూర్యదేవర 2005వ సంవత్సరంలో జనరల్ మోటార్స్‌లో చేరారు.అక్కడ వివిధ స్థాయిల్లో ఎన్నో పదువులు నిర్వర్తించారు.2017 జూలై నుంచి సంస్థ కార్పోరేట్ ఫైనాన్స్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.అనంతరం సెప్టెంబర్ నుంచి సీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించారు.

మద్రాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివిన దివ్యా సూర్యదేవర ఆ తర్వాత అమెరికాకు వచ్చారు.హార్వార్డ్ వర్సిటీలో ఎంబీఏ చదివిన అనంతరం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్‌లో తొలుత ఉద్యోగంలో చేరారు.

ఆ తర్వాత 25 ఏళ్లకే జనరల్ మోటార్స్‌లో చేరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube