బైడెన్ టీమ్‌లోకి మరో భారతీయురాలు: వాల్ట్‌డిస్నీ టూ వైట్‌హౌస్‌‌‌ దాకా ..!!

అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ తన విజయంలో కీలక పాత్ర పోషించిన భారతీయులకు తన జట్టులో బాధ్యలు అప్పగిస్తూనే వున్నారు.ఇప్పటికే ఎంతో మంది భారత సంతతి వారికి కీలక పదవులు కట్టబెట్టిన బైడెన్.

 Indian-american Garima Verma Named Digital Director In Office Of The First Lady,-TeluguStop.com

తాజాగా మరొకరికి తన టీమ్‌లో చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన మహిళా స్ట్రాటజిస్ట్ గరిమా వర్మ.

కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.ఈ మేరకు జో బిడెన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

గరిమా వర్మతో పాటు జిల్ బైడెన్ కార్యాలయంలో రోరీ బ్రోసియస్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.
గరిమా వర్మ భారత్‌లో జన్మించారు.

అనంతరం ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి ఓహియోలో స్థిరపడ్డారు.ప్రస్తుతం ఆమె కుటుంబం కాలిఫోర్నియాలోని సెంట్రల్ వ్యాలీలో నివసిస్తోంది.

గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గరిమా వర్మ .బిడెన్-హ్యారిస్ క్యాంప్‌లో మీడియా స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించారు.రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు గరిమా.పారామౌంట్ పిక్చర్స్‌లో గ్రాఫిక్స్ డివిజన్‌ హెడ్‌గా ఉన్నారు.అనంతరం ఏబీసీ నెట్‌వర్క్‌లో టెలివిజన్ షో హోస్ట్‌గా వ్యవహరించారు.ఈ ఏబీసీ నెట్‌వర్క్.

వాల్ట్ డిస్నీ గ్రూప్‌కు చెందిన కంపెనీ.అనంతరం గరిమా వర్మ హారిజాన్ మీడియా అనే ఏజెన్సీని నడిపారు.

అంతేకాకుండా ఆమె ఎన్నో చిన్న వ్యాపార సంస్థలు, ఎన్జీవోలకు మార్కెటింగ్, డిజైన్, డిజిటల్‌ విభాగాల్లో ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.

Telugu America, Garima Verma, Garimaverma, Indian Origin, Indianamerican, Joe Bi

కాగా, జో బైడెన్‌ టీమ్‌లో కమలా హారీస్, నీరా టాండన్, వివేక్ మూర్తి, రోహిణి కోసోగ్లు, అలీ జైదీ, భరత్ రామమూర్తి, వేదాంత్ పటేల్, వినయ్ రెడ్డి, గౌతమ్ రాఘవన్ తదితరులు చోటు దక్కించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube