డ్రగ్స్ ఇచ్చి టీనేజ్ అమ్మాయిలతో తండ్రీకొడుకులు శృంగారం.. అరెస్టు చేసిన కెనడా పోలీసులు..

కెనడాలో ఎన్నారైలు అయిన తండ్రి, కొడుకులు కాలంగా టీనేజ్ అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.వారిపై దోపిడీకి కూడా పాల్పడుతున్నారు.

 Indian Origin Father-son Arrested In Canada For Assaulting Teen Girls Details, N-TeluguStop.com

ఎట్టకేలకు వీరిని కెనడా పోలీసులు( Canada Police ) అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు వెల్లడించారు.భారత సంతతికి చెందిన గురుపర్తాప్ సింగ్ వాలియా (56)( Gurpartap Singh Walia ) తన కుమారుడు సుమ్రిత్ వాలియా (24)( Sumrit Walia ) కాల్గరీలోని హాడన్ కన్వీనియన్స్ స్టోర్‌ నడుపుతున్నారు.

ఈ స్టర్‌కి వచ్చిన అమ్మాయిలతో వారు సెక్స్‌ చేసేవారు.తర్వాత ఆ అమ్మాయిలకు మద్యం, వేప్‌లు, మత్తుపదార్థాలను ఉచితంగా ఆఫర్ చేసేవారు.

Telugu Teen, Calgarychild, Canada, Son, Indian Origin, Latest, Nri, Sumrit Walia

వీరి ఆగడాలు ఇలా సాగుతుండగా ఒక కేసు వీరి మెడకు చుట్టుకుంది.13 ఏళ్ల బాలిక గతంలో మిస్ కాగా ఆమెను పోలీసులు రీసెంట్‌గా గుర్తించారు.తర్వాత ఏప్రిల్‌లో కాల్గరీ పోలీస్ సర్వీస్ చైల్డ్ అబ్యూజ్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది.అప్పుడు తనకు శృంగారానికి బదులుగా మద్యం, డ్రగ్స్, వేప్‌లు అందించిన సుమ్రిత్‌తో తనకు సంబంధం ఉందని బాలిక పోలీసులకు వెల్లడించింది.

మరోవైపు వాలియాస్ యాజమాన్యంలోని ప్రీమియర్ లిక్కర్ వైన్ అండ్ స్పిరిట్స్‌లో 2022 డిసెంబర్ – 2023 మే మధ్య దాడులు జరిగాయి.ఈ కంపెనీలు వారి కన్వీనియన్స్ స్టోర్ పక్కనే ఉన్నాయి.

Telugu Teen, Calgarychild, Canada, Son, Indian Origin, Latest, Nri, Sumrit Walia

పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ ఈ తండ్రీ కొడుకులు మరింతమంది అమ్మాయిలను వాడుకున్నారని తెలిసింది.దాంతో గురువారం, పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.పనామౌంట్ క్లోజ్ 100 బ్లాక్‌లో ఉన్న వీటి ఇంటిలో సెర్చ్ చేసి 97,500 కెనడియన్ డాలర్లు, ఏడు తుపాకీలతో సహా 975 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అంతేకాదు చైల్డ్ పోర్న్ వీడియోస్, డ్రగ్స్, డ్రగ్ సామాగ్రి, కాంట్రాబ్యాండ్ పొగాకు, వేప్ కాట్రిడ్జ్‌లు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆపై సుమ్రిత్ వాలియా, గురుపర్తాప్ సింగ్ వాలియాలపై పోలీసులు సంబంధిత కేసులో నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube