రోడ్డు మీద రూ.10 నోటు కనిపిస్తేనే దానిని ఎవరైనా గమనిస్తున్నారా లేదోనని చూసి చటుక్కున జేబులో పెట్టుకుని సైలంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాం.అలాంటిది ఏకంగా రూ.7.3 కోట్ల విలువైన లాటరీ తమ చేతుల్లోనే వున్నా.కోటీశ్వరులయ్యే ఛాన్స్ కళ్లెదుటే వున్నా, పరుల సొమ్ము పాములాంటిదని భావించి దానిని ముట్టుకోకుండా అసలు వ్యక్తికే ఇచ్చేసిందో కుటుంబం.
వివరాల్లోకి వెళితే.మౌనిశ్ షా అనే భారతీయుడు అమెరికాలోని మసాచుసెట్స్‌లో స్థిరపడ్డాడు.అతను సొంతంగా ఓ దుకాణాన్ని నడుపుతున్నాడు.అందులో లాటరీ టికెట్లను కూడా మౌనిశ్ విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్ షా భార్య 1 మిలియన్ డాలర్ విలువ చేసే లాటరీ టికెట్‌ని ‘‘లీస్ రోజ్ ఫిగా’’ అనే మహిళకు అమ్మింది.ఆమె అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే బంపర్ లాటరీ తగిలింది.
అయితే లీస్ రోజ్ షిగా ఆ టికెట్‌ని సరిగా స్క్రాచ్ చేయకుండానే.తనకు లాటరీ తగలలేదని భావించి మౌనీశ్ స్టోర్‌లో ఉన్న చెత్త డబ్బాలో పడేసింది.ఇదే సమయంలో మౌనిశ్ కుమారుడు అభి షా సాయంత్రం డస్ట్‌బిన్‌లో ఉన్న టికెట్లను బయటకు తీసి చెక్ చేస్తుండగా.ఓ టికెట్ సరిగా స్క్రాచ్ చేయకపోవడం గమనించాడు.
వెంటనే ఆ కుర్రాడు దానిని పూర్తిగా స్క్రాచ్ చేసి చూడగా.ఆ నంబర్‌కే లాటరీ తగిలిందని గమనించాడు.దాదాపు 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 7.3 కోట్లు) బంపర్ ప్రైజ్ కావడంతో అభి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

వెంటనే దీనిని తల్లిదండ్రులకు చూపించాడు.ఆ డబ్బుతో ఏవేవో కొనాలని అభి ప్లాన్లు వేసుకున్నాడు.తనకు ఎంతో ఇష్టమైన టెస్లా కారు కొనాలని భావించాడు.కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాని అసలు యజమానురాలు లీస్ రోజ్ ఫిగాకు అప్పగించాలని భావించారు.
కానీ అభికి అది ఏ మాత్రం ఇష్టం లేదు.వెంటనే భారతదేశంలో వున్న తాతయ్య, నానమ్మలకు విషయం చెప్పగా వారు కూడా ఆ టికెట్ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమని సూచించారు.
వారి సూచనతో అభి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని లీస్ రోజ్ ఫిగా పని చేస్తున్న చోటకు వెళ్లి తను కొన్న టికెట్ అప్పగించారు.దీనిపై లీస్ రోజ్ ఫిగా మాట్లాడుతూ.
తాను డస్ట్‌బిన్‌లో పడేసిన టికెట్ నా చేతిలో పెట్టి.లాటరీ తగిలిందని వారు చెప్పారని ఉద్వేగానికి గురయ్యారు.
ఆ సంతోషంతో అక్కడే కూర్చుని ఏడ్చానని.ఆ తర్వాత ఆ కుటుంబసభ్యులను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపానని రోజ్ ఫిగా చెప్పారు.
ఈ రోజుల్లో కూడా ఇంత నిజయాతీపరులు ఉంటారని తాను ఊహించలేదని.జీవితాంతం వారికి రుణపడి ఉంటానన్నారు.