నాసా మార్స్ ప్రాజెక్ట్‌లో ‘‘ భారతీయం ’’: ఇప్పటికే స్వాతిమోహన్.. తాజాగా మరో ఇద్దరికి చోటు..!!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మార్స్ మిషన్‌లో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇప్పటికే భారత సంతతికి చెందిన స్వాతీమోహన్ ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తాజాగా మరో ఇద్దరు భారత మూలాలున్న వ్యక్తులు రోవర్ మిషన్‌లో పాలుపంచుకోనున్నారు.

 Indian Origin Experts Plays Key Role In Nasas Mars Rover Perseverance Project, N-TeluguStop.com

వీరిలో ఒకరు విష్ణుశ్రీధర్ కాగా, మరొకరు సంజీవ్ గుప్తా.

న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు చెందిన శ్రీధర్‌ ఐదేళ్లుగా కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ (జేపీఎల్‌)లో పనిచేస్తున్నారు.

ప్రస్తుతం మార్స్‌పైకి పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌కు అమర్చిన సూపర్‌క్యామ్‌ను ఆపరేట్‌ చేస్తున్న బృందాన్ని లీడ్‌ చేసే అవకాశం శ్రీధర్‌కి దక్కింది.ఈ కెమెరాతో అక్కడి అతి సూక్ష్మ కణాలను సైతం ఫొటోలు తీసి.

వాటి ఆధారంగా అక్కడ జీవం ఉండేదా.? అనే అంశంతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, రసాయనాల అవశేషాలను అంచనా వేయనున్నారు.

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌ గుప్తా ఖనిజాల గుట్టు విప్పడంలో సిద్ధహస్తుడు.నాసాతో జరిగిన ఒప్పందం ప్రకారం.ఆయన కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపెల్షన్‌ ల్యాబొరేటరీలోనే పనిచేయాల్సి ఉంది.కానీ, కొవిడ్‌ నిబంధనల కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

సంజీవ్ గుప్తా సత్తాను గుర్తించిన నాసా.వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించడం విశేషం.

మొత్తంగా 3 బిలియన్‌ డాలర్ల ( భారత కరెన్సీలో 22 వేల కోట్లు) విలువైన నాసా మార్స్‌ ప్రాజెక్టు ఆయన కనుసన్నల్లో నడవనుంది.ఇక భార‌త సంత‌తికి చెందిన డాక్ట‌ర్ స్వాతి మోహ‌న్.

రోవ‌ర్ ల్యాండింగ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించారు.ప‌ర్సీవ‌రెన్స్ ఆప‌రేష‌న్స్ అన్నింటికీ లీడ్ సిస్ట‌మ్స్ ఇంజినీర్‌గా స్వాతి మోహ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu Nasa, Sanjeev Gupta, Swathi Mohan, Vishnu Sridher-Telugu NRI

అంగారకుడిపై నీటి జాడను కనుగొనడంతో పాటు జీవం ఉనికిని నిర్థారించేందుకు నాసా పర్సెవరెన్స్‌ రోవర్‌ను గతేడాది జూలై 30న ప్రయోగించింది.సుదీర్ఘ ప్రయాణం తర్వాత అది గత నెల 18న అరుణగ్రహంపై దిగింది.అంగారకుడి ఈక్వేటర్‌కు సమీపంలో ఉన్న జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్‌ దిగింది.ఇది కనీసం రెండేళ్ల పాటు మార్స్‌పైనే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది.

దీనిలో భాగంగా అక్కడ జీవం ఉందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు.మార్స్‌పై వున్న రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టి తదితరాలను విశ్లేషిస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube