మార్స్‌పై దిగిన నాసా రోవర్: భారతీయ మహిళ కనుసన్నల్లోనే ప్రయోగం..!!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారకుడిపై విజయవంతంగా దిగింది.అనంతరం మార్స్‌కి చెందిన రెండు చిత్రాలను కూడా పంపటంతో నాసా శాస్త్రవేత్తలు ఆనందంతో గంతులేశారు.

 Indian Origin Dr Swati Mohan To Lead In Charge Of Landing Nasa Perseverance Rove-TeluguStop.com

భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు ఝామున 2:25 గంటలకు పర్సెవరెన్స్ ల్యాండ్‌ అయినట్టు నానా ప్రకటించింది.

అంగారకుడి ఈక్వేటర్‌కు సమీపంలో ఉన్న జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్‌ దిగింది.

ఇది కనీసం రెండేళ్ల పాటు మార్స్‌పైనే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది.దీనిలో భాగంగా అక్కడ జీవం ఉందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు.అక్కడి రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టి తదితరాలను విశ్లేషిస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని పర్యవేక్షించింది ఓ భారతీయ మహిళ కావడం మనందరికీ గర్వకారణం.

భార‌త సంత‌తికి చెందిన డాక్ట‌ర్ స్వాతి మోహ‌న్.రోవ‌ర్ ల్యాండింగ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించారు.

ప‌ర్సీవ‌రెన్స్ ఆప‌రేష‌న్స్ అన్నింటికీ లీడ్ సిస్ట‌మ్స్ ఇంజినీర్‌గా స్వాతి మోహ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu Mars, Nasa, Swathi Mohan-Telugu NRI

భార‌త్‌లో పుట్టిన స్వాతి మోహన్‌కు ఏడాది వయసున్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వ‌ల‌స‌వెళ్లింది.నార్త‌ర్న్ వ‌ర్జీనియా-వాషింగ్ట‌న్ డీసీ మెట్రో ప్రాంతంలో ఆమె త‌న బాల్యాన్ని గ‌డిపారు.మెకానిక‌ల్‌-ఏరోస్పేస్ ఇంజ‌నీరింగ్‌ను కార్నెల్ యూనివ‌ర్సిటీ నుంచి పూర్తి చేశారు స్వాతి.

మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఏరోనాటిక్స్‌-ఆస్ట్రోనాటిక్స్‌లో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేశారు.అనంతరం నాసాలో అడుగుపెట్టిన స్వాతి మోహన్ ఎన్నో మిషన్‌లలో పాలుపంచుకున్నారు.

శ‌ని గ్ర‌హంపై పంపిన కాసిని మిష‌న్‌, మూన్ మీద‌కు వెళ్లిన గ్రెయిల్ కోసం కూడా ఆమె ప‌నిచేశారు.ఇవాళ్టీ మార్స్ మిషన్‌కు నాసా 2013లోనే శ్రీకారం చుట్టింది.

ఈ ప్రాజెక్టు ప్రారంభ‌మైన నాటి నుంచి స్వాతి శ్రమించారు.గైడెన్స్‌, నావిగేషన్, కంట్రోల్స్ ఆప‌రేష‌న్స్ లీడ్‌గా స్వాతి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

కాలిఫోర్నియాలోని ప‌స‌డేనాలో ఉన్న నాసా జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ‌రేట‌రీలో ప్రస్తుతం స్వాతి పనిచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube