ప్రాణాలు పణంగా పెడుతుంటే.. మాపై సర్ ఛార్జా: యూకే సర్కార్‌పై భారతీయ వైద్యుల ఫైర్

యూరప్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ సహా అన్ని దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

 Indian Origin Doctors Unfair Surcharge Amid Pandemic-TeluguStop.com

యూకేలోనూ పరిస్ధితి రోజు రోజుకు విషమిస్తోంది.గురువారం ఒక్కరోజే 115 మంది ప్రాణాలు కోల్పోగా.

మొత్తం మరణాల సంఖ్య 578కి చేరింది.బాధితుల సంఖ్య 11,658కి పెరిగింది.

కఠినచర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం బ్రిటన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.ఈ గణాంకాలను బట్టి బ్రిటన్ మరో ఇటలీగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైద్య రంగంపై భారం పెరిగింది.చికిత్స అందిస్తూ పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బందికి సైతం వైరస్ సోకింది.ఈ క్రమంలో తమపై అన్యాయంగా విధిస్తున్న సర్‌ఛార్జీని రద్దు చేయాలని యూకే జాతీయ ఆరోగ్య సేవలో పనిచేస్తున్న భారతీయ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఆయన లేఖ రాశారు.

తమలో చాలామంది 24 గంటలు కరోనా మహమ్మారిపై ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్నారని వారు లేఖలో పేర్కొన్నారు.

Telugu Pandemic, Indianorigin-

నేషనల్ హెల్త్ సర్వీస్‌ కోసం అదనపు నిధులను సేకరించేందుకు గాను ఆరు నెలల పైబడిన విద్య, ఉపాధి, ఫ్యామిలీ‌ వీసాలపై రుసుము విధించేందుకు గాను ఏప్రిల్ 2015లో ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్ (ఐహెచ్ఎస్)‌ను ప్రవేశపెట్టారు.దీనిని ఈ నెల ప్రారంభంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారతీయ సంతతి ఆర్ధిక మంత్రి రిషి సునక్ 400 పౌండ్ల నుంచి 624 పౌండ్లకు పెంచారు.దీనిపై బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అభ్యంతరం తెలిపింది.

ఈ అదనపు ఛార్జీ వివక్షతో పాటు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది.ఇప్పటికే విదేశీ వలసదారులు బీమా చెల్లింపులు, ఆదాయపు పన్ను‌ ద్వారా యూకే ఖజానాకు భారీగా ఆదాయం అందేలా చేస్తున్నామని అసోసియేషన్ తెలిపింది.

ప్రస్తుత సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అవసరం ఎంతైనా ఉందని అందువల్ల తక్షణం హెల్త్ సర్‌ఛార్జీని తొలగించాలని అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ మెహతా తదితరులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.యూకేలో భారత సంతతికి చెందిన సుమారు 60,000 మంది వైద్యులు ఎన్‌హెచ్ఎస్‌లో పనిచేస్తూ, దేశ ఆరోగ్య రంగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.

ఇటీవల పదవీ విరమణ చేసిన వారిలో కనీసం రెండు వేలమంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నట్లు అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube