పేద విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులెలా: అమెరికాలో భారత సంతతి వైద్యుల దాతృత్వం

కరోనా వైరస్ మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఒక రకంగా చెప్పాలంటే మానవాళి కరోనాకు ముందు.

 Doctors Of Indian Origin Shrink Digital Divide, Donate Laptops To Students In Am-TeluguStop.com

కరోనా తర్వాత అన్నట్లుగా తయారయ్యింది.అన్ని రంగాల్లోనూ మునుపెన్నడూ లేని మార్పులకు వైరస్ శ్రీకారం చుట్టింది.

వీటిలో ఒకటి ఆన్‌లైన్ క్లాసులు.విద్యార్ధులు పాఠశాలలు/ కాలేజీలకు వెళ్లకుండా ఇంటిపట్టునే బోధనలు వింటున్నారు.

అయితే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వున్న వారికే ఆన్‌లైన్ క్లాసులకు వీలు కలుగుతుంది.

పేదలు, అట్టడుగు వర్గాలకు ఇది సాధ్యం కానీ విషయం.

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్ధితుల్లో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు ఇంట్లో పూట గడవటమే కష్టమవుతోంది.మరి ఇలాంటి వారు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సమకూర్చుకోగలరా.? వీరి ఇబ్బందులను అర్ధం చేసుకున్న కొందరు ఎన్ఆర్ఐలు పేదలకు ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేశారు.

Telugu America, Corona Effect, Doctorsindian, Donatelaptops, International, Clas

గ్రేటర్ వాషింగ్టన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీడబ్ల్యూఏపీఐ)‌కు చెందిన సుమారు 500 మంది భారత సంతతి వైద్యుల బృందం పేద విద్యార్ధులను ఆదుకోవాలని భావించింది.దీనిలో భాగంగా రాక్‌విల్లేలోని మోంట్‌గోమేరీ కాలేజీలోని పేద విద్యార్ధులకు 10 వేల డాలర్ల విలువైన లాప్‌టాప్‌లను విరాళంగా అందజేశారు.నేర్చుకోవడంలో విద్యార్ధులకు తాము సహాయం చేయాలనుకుంటున్నామని జీడబ్ల్యూఏపీఐ సభ్యుడు డాక్టర్ సుధీర్ సెఖ్సారియా అన్నారు.

పిల్లలకు విద్య అనేది వారి జీవితంలో చాలా ముఖ్యమైన అంశమన్న ఆయన.తాము పిల్లలకు చదువునిస్తే, అది వారికి మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు.కాగా కరోనా విపత్తు సమయంలో జీడబ్ల్యూఏపీఐ వాషింగ్టన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అనేక డ్రైవ్‌లను నిర్వహిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube