90 మంది మహిళా రోగులపై లైంగిక వేధింపులు: భారత సంతతి డాక్టర్‌కు 3 జీవితఖైదులు

వైద్యో నారాయణో హరి: అన్న సూక్తిని విస్మరించి తన దగ్గరకు వచ్చే మహిళా రోగులపైనే ఓ డాక్టర్ కన్నేశాడు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 90 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ భారత సంతతి డాక్టర్‌కు లండన్ కోర్టు మూడు జీవిత ఖైదులను విధించింది.

 Indian Origin Doctor Given 3 Life Sentences-TeluguStop.com

మనీష్ నట్వర్‌లాల్ షా (50) 1993లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొంది జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నాడు.2009 నుంచి 2013 మధ్యకాలంలో తన వద్దకు వచ్చే మహిళా రోగులను క్యాన్సర్ వచ్చిందని భయపెట్టేందుకు ఏంజెలినా జోలీ, జాడే గూడీ వంటి హాలీవుడ్ సెలబ్రెటీల ఆరోగ్య సమస్యలను ఉదాహరణకు చెప్పేవాడు.

Telugu Female London, Indianorigin, Sexual Assaults, Telugu Nri-

తూర్పు లండన్‌లోని రోమ్‌ఫోర్డ్‌లో ఉన్న అతని క్లినిక్‌కు వచ్చిన మహిళా రోగులకు అవసరం లేకపోయినా రొమ్ము, యోని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సిఫారసు చేశాడు.ఎందుకని రోగులు ప్రశ్నిస్తే.గర్భాశయ క్యాన్సర్, రొమ్మ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు అనేవాడు.పరీక్షల సందర్భంగా మహిళా రోగులను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటి చేసేవాడు.అతని ట్రాప్‌లో పడిన వారితో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు.
ఈ వ్యవహారాలకు సంబంధించి కొందరు మహిళా రోగులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2013లో తొలిసారిగా నట్వర్‌లాల్‌ను అరెస్ట్ చేశాడు.2018లో జరిగిన విచారణ సందర్భంగా 18 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు రుజువవ్వగా.నిదానంగా ఆ సంఖ్య 90కి చేరింది.

అతని లైంగిక నేరాలు వెలుగులోకి రావడంతో 2013లో షా ను మెడికల్ ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేశారు.ఈ కేసులో అతని నేరం రుజువుకావడంతో మనీష్ షాకు మూడు జీవితఖైదులు విధిస్తూ లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టు జడ్జి మోలిన్యూక్స్ తీర్పు వెలువరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube