హెల్త్‌కేర్ స్కామ్‌: భారతీయ సంతతి వైద్యుడికి రెండేళ్ల జైలు శిక్ష

అమెరికాలో సంచలనం సృష్టించిన హెల్త్‌ కేర్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అక్కడి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.వివరాల్లోకి వెళితే.

 Indian Origin Doctor Gets 2 Years Healthcare Fraud In Us-TeluguStop.com

కాలిఫోర్నియాకు చెందిన 56 ఏళ్ల కైన్ కుమార్‌కు సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా.యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఫిలిప్ గుటిరెజ్ మంగళవారం శిక్ష విధించారు.శిక్షాకాలంలో పునరావాస సమయంలో 5,09,365 డాలర్లు, ఆస్తుల జప్తు చేసి 4,94,900 డాలర్లుతో పాటు మరో 72,000 డాలర్లను జరిమానా విధించారు.

2019 ఏప్రిల్‌లో చోటు చేసుకున్న ఈ హెల్త్‌కేర్ స్కామ్‌కు సంబంధించి కుమార్‌పై చీటింగ్, చట్టవిరుద్ధంగా హైడ్రోకోడోన్ పంపిణీ కింద కేసులు నమోదు చేశారు.2011 ఫిబ్రవరి నుంచి 2016 మే వరకు మెడికల్ హెల్త్ కేర్ కార్యక్రమాన్ని కుమార్ దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది.అవసరం లేకపోయినప్పటికీ.

ఆరోగ్య సేవలను సూచించడం ద్వారా కుమార్ కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న హెల్త్ ఏజెన్సీ నుంచి లబ్ధి పొందినట్లుగా తేలింది.

Telugu Indian Origin, Telugu Nri Ups-

తాను వ్యక్తిగతంగా రోగులను పరీక్షించలేదని, అలాగే మెడికేర్ రీయింబర్స్‌మెంట్ కోసం మోసపూరితంగా వ్యవహరించినట్లు కుమార్ విచారణలో అంగీకరించాడు.రోగులను పరీక్షించకుండానే హైడ్రోకోడోన్ మందుల ప్రిస్క్రిప్షన్లను ఇవ్వాల్సిందిగా కుమార్ తన కార్యాలయ సిబ్బందికి సూచించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube