మిస్ ఇంగ్లాండ్ కిరీటం సొంతం చేసుకున్న భారతీయ యువతి

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ అమ్మాయిలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు.ఇక అందగత్తే పోటీలలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Indian Origin Doctor Bhasha Mukherjee Crowned Miss England 2019 1-TeluguStop.com

భారతీయ భామలు విదేశాల్లో తమ అందంతో ఆకట్టుకొని ఆయా దేశాలలో జరిగే అందాల పోటీల్లో విజేతలుగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా దేశాల్లో ఇండియన్ ఎన్నారై భామలు అందాల పోటీలలో పాల్గొని కిరీటాలు దక్కించుకున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ భాషా ముఖర్జీ అనే యువతీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

డెర్బీకి చెందిన 23 ఏళ్ల ఈ భామ ఇప్పటికే రెండు మెడికల్ డిగ్రీ పట్టాలు సొంతం చేసుకుంది.

ప్రపంచంలోనే అతి తక్కువ మందికి ఉండే ఐక్యూ లెవెల్స్ ఈ భామకి ఉండటం విశేషం.బోస్టన్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న భాషా ముఖర్జీ ఇండియాలోనే జన్మించిన, తొమ్మిదేళ్ల వయసులో ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ కి వెళ్ళింది.

అక్కడ మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసిన ఈమె తాజాగా జరిగిన అందాల పోటీలలో పాల్గొని మిస్ ఇంగ్లాండ్ గా కిరీటం కైవసం చేసుకుంది.త్వరలో ఆ దేశం తరఫున మిస్ వరల్డ్ పోటీలు కూడా వెళ్ళిపోతుంది.

ఇప్పటికే ఇండియా భామలు ప్రపంచ అందాల పోటీలలో సత్తా చాటుతున్న తరుణంలో ఈ భామ కూడా అందాల రాణిగా ఇంగ్లాండ్ నుంచి అందాల పోటీలకు వెళ్లడం విశేషం.మరి ప్రపంచ అందాల పోటీల్లో ఈ ఇండియన్ ఎన్నారై భామ ఎంత వరకు తన సత్తా చూపిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube