అమెరికాలో భారతీయ పారిశ్రామికవేత్తకు అరుదైన పురస్కారం  

Eminent Indian-American entrepreneur Dr Dinesh C Patel, Indian-American honoured with Utah Governor’s Medal, Utah Governor’s Medal, Lifetime Achievement Medal , Govenor Medal for Science and Technology - Telugu Eminent Indian-american Entrepreneur Dr Dinesh C Patel, Govenor Medal For Science And Technology, Indian-american Honoured With Utah Governor’s Medal, Lifetime Achievement Medal, Utah Governor’s Medal

సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రా నూయి వీరంతా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారతీయులే.తమ కృషి, పట్టుదల, ప్రతిభతో వీరు అద్భుత విజయాలను సాధిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

TeluguStop.com - Indian Origin Dinesh C Patel Honoured With Utah Governors Medal

తద్వారా నీడనిచ్చిన దేశానికి పేరు తీసుకొస్తూనే మరోవైపు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.తాజాగా అమెరికాలో స్థిరపడిన భారత సంతతి పారిశ్రామిక వేత్తకు అరుదైన పురస్కారం దక్కింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను డా.దినేష్ సీ పటేల్‌కు ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పటేల్ సేవలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.కాగా, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రానికి విశిష్ట సేవలను అందించిన వారి కృషికి గుర్తింపుగా 1987 నుంచి ఉతా ప్రభుత్వం ‘గవర్నర్ మెడల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పురస్కారం అందిస్తోంది.

TeluguStop.com - అమెరికాలో భారతీయ పారిశ్రామికవేత్తకు అరుదైన పురస్కారం-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనిలో భాగంగానే పటేల్‌ను బుధవారం సత్కరించారు.

భారత్ నుంచి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన దినేశ్ పటేల్ ఉతాలో స్థిరపడ్డారు.

బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు.పటేల్ కృషి ఫలితంగా ఈ రంగంలో ఆర్థిక విజయాన్ని సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను మెరుగుపరిచింది.1985లో థెరాటెక్ అనే బయోటెక్ సంస్థను స్థాపించిన దినేశ్ పటేల్ అధ్యక్షుడిగా, సీఈఓగా తన నాయకత్వ ప్రతిభతో విజయవంతంగా నడిపించారు.1999లో ఈ సంస్థను వాట్సన్ ఫార్మాస్యూటికల్స్ ఏకంగా 350 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం.

థెరాటెక్ కంటే ముందే దినేశ్.సాలస్ థెరప్యూటిక్స్ అనే సంస్థను స్థాపించారు.ఇది యాంటీ సెన్స్ ఫార్మాస్యూటికల్స్‌ను అభివృద్ధి చేసే బయోటెక్నాలజీ సంస్థ.ఆ తర్వాత కూడా పటేల్ ఉతా రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.

వీటిలో ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి.ఈ విధంగా రాష్ట్రాభివృద్ధికి దోహాదం చేసినందుకు గాను దినేష్ పటేల్‌ను ప్రభుత్వం ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

.

#GovenorMedal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Dinesh C Patel Honoured With Utah Governors Medal Related Telugu News,Photos/Pics,Images..