పీపీఈ కిట్ల వాడకంపై మార్గదర్శకాలు: యూకే ప్రభుత్వంపై కోర్టుకెక్కిన భారతీయ జంట

కరోనా వైరస్‌ నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది చేస్తున్న త్యాగం వెలకట్టలేనిది.ఇప్పటికే పలువురు డాక్టర్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

 Coronavirus: Indian-origin Couple Moves Court Against Uk Government Over Ppe Gui-TeluguStop.com

ఇంతటి సేవలు చేస్తున్న వైద్యులను కొన్ని దేశాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు.వీరికి అవసరమైన పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ఇతర రక్షణ పరికరాలను అందజేయడం లేదు.

తాజాగా యూకే ప్రభుత్వ వైఖరిపై ఓ భారత వైద్య దంపతులు కోర్టును ఆశ్రయించారు.అసలు ఎం జరిగిందంటే.డాక్టర్ నిషాంత్ జోషి, ఆయన భార్య మీనాల్ విజ్‌లు వైద్యులుగా పనిచేస్తున్నారు.దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమకు సర్జికల్ గౌన్స్‌తో పాటు పీపీఈ కిట్లు ఇవ్వాలంటూ మీనాల్ విజ్ లండన్‌లో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

అప్పటికే ఆమె ఆరు నెలల గర్భవతి.ప్రొటెక్ట్ హెల్త్‌కేర్ వర్కర్స్ అని రాసి వున్న ప్లకార్డును పట్టుకుని మీనాల్ ఒంటరిగా నిరసనకు దిగారు.

Telugu Indian Origin, Meenal Vij, Nishanth Joshi, Uk, Ukindian, Uk Ppe Kits-

ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన తర్వాత లండన్‌ హైకోర్టును ఆశ్రయించాలని గురువారం నిర్ణయించారు.దీనిపై ఈ జంట స్పందిస్తూ.నెల క్రితం తాము యూకే హెల్త్ సెక్రటరీకి లేఖ రాసిన సమయంలో దేశంలో 100 మందికి పైగా హెల్త్ కేర్ వర్కర్స్ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.వీరి త్యాగం తమను తీవ్రంగా కలిచివేసిందని.

ఇందులో చాలా మందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు లేవని ఈ జంట తెలిపింది.

Telugu Indian Origin, Meenal Vij, Nishanth Joshi, Uk, Ukindian, Uk Ppe Kits-

యూకే ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంరక్షణ కార్యకర్తలకు పీపీఈ కిట్లు ధరించే అవసరాన్ని తగ్గిస్తుందని నిషాంత్ దంపతులు చెప్పారు.ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య కార్యకర్తలను ప్రమాదంలో పడేస్తుందని వారు ఆరోపించారు.కాగా యూకేలో ఇప్పటి వరకు 2,54,195 మందికి కరోనా సోకగా, 36,398 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube