మూడేళ్ల చిన్నారి, పెంపుడు కుక్క సహా శవాలుగా తేలిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ

యూకేలో దారుణం జరిగింది.ఓ ఎన్ఆర్ఐ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో సొంత ఇంట్లోనే శవాలుగా తేలారు.

 Indian Origin Family Found Dead In Uk Home. Indian Origin Family,uk, Purna Kames-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.కుహరాజ్ సీతంపరనాథ్, అతని భార్య పూర్ణ కామేశ్వరి శివరాజ్‌లు మలేషియాకు చెందిన తమిళ జంట.ఈ దంపతులకు కైలాశ్ కుహరాజ్ అనే మూడేళ్ల చిన్నారి ఉన్నాడు.వీరంతా వెస్ట్ లండన్‌లోని బ్రెంట్‌ఫోర్డ్‌లో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో సుమారు 15 రోజులకు పైగా వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఎంత గాలించినప్పటికీ కుహరాజ్ కుటుంబం జాడ తెలియరాలేదు.

దీంతో సోమవారం రాత్రి వెస్ట్ లండన్ పోలీసులు బ్రెంట్‌ఫోర్డ్‌లోని కుహరాజ్ ఫ్లాట్ వద్దకు వెళ్లారు.ఎన్ని ఫోన్లు చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడం, తలుపులు కొట్టినా ఎవరూ పలకపోవడం, ఎలాంటి అలికిడి లేకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు.

కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపల జనం ఉన్న గుర్తులు ఏం కనిపించలేదు.చేసేది లేక తలుపులు బద్ధలు కొట్టి చూశారు.

Telugu Indianorigin, Kailash, Tamil-Telugu NRI

అక్కడ కుహరాజ్ కుటుంబసభ్యులు రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు.దీనిపై స్థానికులను విచారించగా.సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి ఆ ఇంటికి, ఎవరు వచ్చి పోయినట్లుగా, ఇంట్లో మనిషులున్నట్లు అలికిడి వినిపించలేదని తెలిపారు.కుహరాజ్ దంపతులు అందరితో కలివిడిగా ఉంటారని, నవ్వుతూ పలకరించేవారని స్థానికులు తెలిపారు.

అయితే అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లుగా అరుపులు వినిపించేవని చెప్పారు.

పూర్ణ కామేశ్వరీ, కైలాష్‌లు చనిపోయి పదిరోజులు అవుతుండగా.

కుహరాజ్ మాత్రం పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి కొన్ని క్షణాల ముందు మరణించినట్లుగా తెలుస్తోంది.వీరిని ఎవరైనా హత్య చేశారా.? లేక కుహరాజే భార్యా, పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube