కరోనా కరాళ నృత్యం… ప్రకృతిని మన్నించమంటూ ఆకాశ నృత్యం: భారతీయ నృత్యకారిణి ప్రతిభ  

Indian Origin Classical Dancer Life Style - Telugu Cinema Life Style, Indian Origin Classical Dancer, Indian Origin Classical Dancer In Us, Lakshmi Babu Comments On Cinema Life Style

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

 Indian Origin Classical Dancer Life Style

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ నృత్యకారిణి లక్ష్మీబాబు వినూత్నంగా ఆలోచించారు.

స్వతహాగా కూచిపూడి నాట్యంలో నిష్ణాతురాలైన ఆమె.ప్రకృతికి మానవాళి చేస్తున్న అపరాధాలను మన్నించమని వేడుకుంటూ ‘‘ ఆకాశ నృత్యం పేరుతో ఓ డ్యాన్స్ ఫ్యూజన్ రూపొందించారు.ఈ వినూత్న నృత్య రూపకంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్న కూచిపూడి, సత్రియ, భరత నాట్యం, చావ్, కథక్, మోహినీఘట్టం, ఒడిస్సీ, కథకళి, మణిపురి మిళితం చేసి రూపొందించడం విశేషం.

కరోనా కరాళ నృత్యం… ప్రకృతిని మన్నించమంటూ ఆకాశ నృత్యం: భారతీయ నృత్యకారిణి ప్రతిభ-Telugu NRI-Telugu Tollywood Photo Image

గతంలో ప్రపంచాన్ని పట్టి కుదిపేసి, మానవాళి మనుగడకే సవాల్ విసిరిన ప్లేగు వ్యాధి గురించి ‘‘లయర్’’ అనే నాకటంలో ప్రఖ్యాత రచయిత షేక్స్‌పియర్ చర్చించినట్లుగా.తాను ‘‘ ఆకాశ నృత్యం’’లో కరోనా గురించి ప్రస్తావించినట్లు లక్ష్మీబాబు తెలిపారు.

తెలంగాణకు చెందిన లక్ష్మీ.వివాహానంతరం భర్తతో కలిసి 30 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు.

అక్కడి మేరీల్యాండ్‌‌లో భర్తాపిల్లలతో స్థిరపడ్డారు.విదేశంలో ఉంటున్నప్పటికీ, భారతీయ మూలాలు మరచిపోకుండా వాటిని భావితరాలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

అమెరికాలో స్ధిరపడ్డ తెలుగు కుటుంబాల్లోని పిల్లలకు… తెలుగు పద్యాలు, శతకాలు, కీర్తనలు, నృత్యాలు నేర్పిస్తున్నారు.ఇకపోతే సినిమాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న లక్ష్మీబాబు.

మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు పరిరక్షించడంలో సినిమా ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.నటనపై ఇష్టం ఉండటంతో.

అమెరికాలో చిత్రీకరణ జరుపుకునే చిత్రాల్లో తన మనసుకు, వయసుకు నచ్చే పాత్రల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Classical Dancer Life Style Related Telugu News,Photos/Pics,Images..

footer-test