అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ...!!!

ఏ దేశమేగినా ఆ దేశ చరిత్రలో మనకంటూ ఓ పేజీ సృష్టించుకోవడం, కీలకమైన భాగస్వాములు కావడం భారతీయులకు కొత్తేమీ కాదు.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో మన భారతీయుల అసామాన్య ప్రతిభకు అమెరికా సలామ్ కొట్టాల్సిందే.

 Ramya Jawahar Kudekallu Chairperson Of New York City Bar’s International Human-TeluguStop.com

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వారు దాదాపు 50 మందికి పైనే కొలువు దీరి ఉండగా, మరి కొందరు అమెరికాలో ప్రతిష్టాత్మక పదవులలో కొలువు దీరుతూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు.తాజాగా.

బెంగుళూరు కి చెందిన మహిళా న్యాయవాది రమ్యా జవహార్ అమెరికాలో స్థిరపడ్డారు.ఎంతో ప్రతిభ కలిగిన న్యాయవాదిగా పేరొందిన ఆమెకు న్యూయార్క్ సిటీ బార్ అంతర్జాతీయ మానవహక్కుల కమిటీ చైర్పర్సన్ గా కీలక పదవి దక్కింది.

ఇక్కడ మరొక విషయం ఏంటంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఓ మహిళకు అది కూడా భారత సంతతి మహిళకు ఈ పదవి వరించిందని తెలుస్తోంది.బెంగుళూరు లోనే పుట్టి, విధ్యాబ్యాసం పూర్తి చేసుకున్న రమ్య ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళారు.

అక్కడ ఇంటర్నేషనల్ లా అండ్ జస్టిస్ లో మాస్టర్స్ చేశారు.

చదువు పూర్తయిన తరువాత సెక్స్ వర్కర్లు, పిల్లల హక్కులు, మహిళా సమస్యలపై లా ఫోరం తో కలిసి పనిచేశారు.

ఈ క్రమంలోనే రమ్య కు అమెరికా వ్యాప్తంగా అణగారిన వర్గాలలో విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది.క్రమ క్రమంగా తన దైనందిక జీవితం మొత్తం సమాజ సేవకే అన్నట్టుగా వెచ్చించిన ఆమె న్యూయార్క్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతి పెద్ద న్యాయవాదుల సంఘం కు చైర్మెన్ గా ఎన్నికయ్యారు.

ఈ పదవి దక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తనను ఈ పదవికి ఎంపిక చేయడం అనేది జీవితంలో మర్చిపోలేని గౌరవంగా భావిస్తానని ఆమె తెలిపారు.

భవిష్యత్తులో ప్రజా, సమాజ శ్రేయస్సు కోసం తాను కృషి చేస్తానని ఆమె తెలిపారు.ఇదిలాఉంటే ఈ పదవిలో ఆమె మూడేళ్ళ పాటు కొనసాగుతారని న్యూయార్క్ సిటీ బార్ అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube