మాతృదేశం.. ఆదరించిన దేశానికి కృతజ్ఞత: విద్యా రంగానికి తెలుగు ఎన్ఆర్ఐ చేయూత

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.అలాగే పొట్ట చేత పట్టుకుని వచ్చినప్పుడు ఆదరించి, ఆశ్రయం ఇచ్చిన పరాయి గడ్డపై సైతం అదే స్థాయిలో అభిమానాన్ని చూపిస్తున్నారు.

 Indian Origin Businessman Ravi Shakamuri Boosts Education, Ravi Shakamuri, India-TeluguStop.com

అనేక దేశాల్లో వున్న భారతీయ సమాజాలు స్వదేశంతో పాటు స్థిరపడిన దేశాల రుణాన్ని ఏకకాలంలో తీర్చుకుంటున్నారు.ఇలాంటి వారిలో ఒకరు తెలుగు ఎన్ఆర్ఐ రవి శాఖమూరి.

అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఆయన టెక్సాస్‌‌లోని స్థానిక యువతతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు టెక్నికల్ జాబ్స్‌కు అర్హత సాధించేందుకు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భాగమయ్యేందుకు సాయం చేస్తున్నారు.రవితో పాటు ఆయన భార్య మధు పెర్మియన్ బేసిన్‌, ఆగ్నేయ న్యూ మెక్సికోలలోని వైద్య సంఘాలకు వివిధ మార్గాల ద్వారా సేవలందిస్తున్న కంపెనీలను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రవి శాఖమూరి మాట్లాడుతూ.ACCESS for SUCCESS కార్యక్రమం ద్వారా యువతను ప్రొత్సహిస్తున్నట్లు తెలిపారు.K-12 విద్యార్ధులకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ పాఠశాలలు సాయం పొందేందుకు మెరుగ్గా వున్నట్లు రవి చెప్పారు.అయితే విద్యార్ధులు, కుటుంబాలకు ఆ సాయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోతే తమ ప్రయత్నానికి ప్రయోజనం వుండదని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన రవి శాఖమూరి (61) ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మెరైన్ బయాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.అయితే ఆయన ఒక ఫిషరీస్ సంస్థను ప్రారంభించేందుకు గాను ఫైనాన్సింగ్ పొందలేకపోయారు.

రవి సోదరి శోభా నెఫ్రాలాజిస్ట్‌గా టెక్సాస్‌లోనే ప్రాక్టీస్ చేస్తుండటంతో ఆయన తన కార్యక్షేత్రాన్ని అమెరికాకు మార్చారు.అనంతరం టెక్సాస్‌ టెక్‌లో బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో శాఖమూరి మాస్టర్స్ పట్టా అందుకున్నారు.

ఆస్టిన్ కేంద్రంగా నడుస్తున్న కంపెనీలకు కన్సల్టెంట్, మేనేజర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు.రవి కుమారుడు నితిన్.

ఓక్లహోమా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో చదువుకుంటున్నాడు.

ఇక రవికి చెందిన స్టార్ కేర్ హెల్త్ సర్వీసెస్, స్టార్ కేర్ హోమ్ హెల్త్, స్టార్ హోస్పైస్, స్టార్ ఆక్సిజన్ & మెడికల్ ఎక్విప్‌మెంట్‌ల వార్షిక స్థూల ఆదాయం 7 మిలియన్ డాలర్లు.2014లో రవి శాఖమూరి తన ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్ఫో సిస్టమ్స్‌ని 10 మిలియన్లకు మరో కంపెనీకి విక్రయించారు.తన తల్లిదండ్రులు ఎస్‌వీకే ప్రసాద్, సుగుణలు భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని రవి వెల్లడించారు.

భూస్వాములైన తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు గాను ఆస్తులన్నీ వదులుకున్నారని.మధు, నేను జీవితాలను పూర్తిగా త్యాగం చేసేంత గొప్పవారం కాదని ఆయన తెలిపారు.

ACCESS ప్రోగ్రాం కోసం రెండేళ్లపాటు కెర్మిట్, ప్రెసిడియో పాఠశాలలతో కలిసి పనిచేసేందుకు రవి సిద్ధమవుతున్నారు.అలాగే పెర్మియన్ బేసిన్‌లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ECISDలో వున్న ఉన్నత పాఠశాలలను సంప్రదిస్తున్నారు.

దక్షిణ భారత దేశంలోని అటవిక తెగలకు చెందిన సుమారు 5,000 మంది విద్యార్ధులను గతేడాది పైలట్ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు.ఈ ఏడాది దానిని 27,000కు పెంచాలని రవి లక్ష్యంగా పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube