Mohan Mansigani : యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’’...!!

లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో యూకే రాజకుటుంబం నుంచి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవా కార్యకర్త మోహన్ మాన్సిగాని ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’ (ఓబీఈ) అందుకున్నారు.నార్త్ లండన్‌కు చెందిన మోహన్.

 Indian-origin Businessman Mohan Mansigani Correct Order Of The British Empire Fr-TeluguStop.com

సెయింట్ జాన్ అంబులెన్స్ ఛారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను గతేడాది దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 జన్మదిన వేడుకల సందర్భంగా ఈ అవార్డ్‌ను ప్రకటించారు.

యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో ఫెలో అయిన మాన్సిగాని.ఆరేళ్ల క్రితం సెయింట్ జాన్‌లోని అంబులెన్స్ బోర్డులో చేరారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.వలసదారుల సంతతికి చెందిన తాను ఈ అవార్డ్ అందుకోవడం తన కలలకు మించినదన్నారు.

గత 20 ఏళ్లుగా మిల్ హిల్ సాయి సెంటర్ ద్వారా చిన్నారులకు మానవీయ విలువలు బోధిస్తున్న తన భార్య రేణుకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నానని మోహన్ చెప్పారు.జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో పాటు కుటుంబాన్ని పోషించాలనే లక్ష్యంతో తన తండ్రి 1951లో భారతదేశం నుంచి లండన్‌కు వలస వచ్చారని ఆయన తెలిపారు.

Telugu Businessman, Casual, Indian Origin, Mohan Mansigani, British Empire, Renu

ఆర్ధిక రంగంలో అనుభవంతో పాటు ప్రైవేట్ ఈక్విటీలోనూ మోహన్‌ది అందెవేసినచేయి.ఫైనాన్స్ డైరెక్టర్‌గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.క్యాజువల్ డైనింగ్ గ్రూప్‌ను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.యూకేలోని ప్రముఖ రెస్టారెంట్ బ్రాండ్‌లైన కేఫ్ రూజ్, స్ట్రాడాను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది.జూలై 2016 నుంచి సెయింట్ జాన్ అంబులెన్స్‌లో మోహన్ ఫైనాన్స్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube