భారత సంతతి వ్యాపారవేత్తని నిషేధించిన యూకే.. కారణమిదే..!!

వస్తువుల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన పన్నులు చెల్లించని అభియోగాలపై భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తపై యూకే నిషేధం విధించింది.దీనిలో భాగంగా దాదాపు ఆరేళ్లపాటు తమ దేశంలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని సర్రేలోని కింగ్‌స్టన్ అపాన్ థేమ్స్‌కు చెందిన రాజేశ్ వోరాలియా ఈ అభియోగాన్ని ఎదుర్కొన్నారు.49 ఏళ్ల ఈయన కోర్టు అనుమతి లేకుండా ఒక సంస్థ యొక్క ప్రమోషన్‌లో పాల్గొనడం లేదా కొత్తగా మరో సంస్థను స్థాపించి దాని నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనడాన్ని న్యాయస్ధానం నిషేధించింది.రాజేశ్ డైరెక్టర్‌గా తన బాధ్యతలను నిర్వహించడంలో విఫలమయ్యారని ఇన్సాల్వెంట్ ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ హెడ్ లారెన్స్ జుస్మాన్ అన్నారు.

 Indian-origin Businessman Banned For Not Paying Correct Tax In Uk, Rajesh Vorali-TeluguStop.com

ఆర్టీఎస్ టెక్స్‌టైల్ రీ సైక్లర్స్ లిమిటెడ్‌ను 2014 సెప్టెంబర్‌లో విలీనం చేసి… రాజేశ్‌ను ఏకైక డైరెక్టర్‌గా నియమించారు.

వెస్ట్ లండన్‌లోని వెస్ట్ డ్రేటన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రధాన వ్యాపారం .ఛారిటీ షాపుల నుంచి వస్తువులను సేకరించి విక్రయించడం.ఆర్టీఎస్ టెక్స్‌టైల్ రీసైక్లర్స్ సంస్థ పన్ను బాధ్యతలను సక్రమంగా పాటించడంలో విఫలమైందని ఇన్సాల్వెన్సీ సర్వీస్ తన దర్యాప్తులో తేల్చడానికి ముందే 2018లో లిక్విడేషన్‌లోకి వెళ్లింది.ఇన్సాల్వెన్సీ సర్వీస్ విచారణలో సదరు సంస్థ 2014 చివరి నుంచి 2017 మధ్యకాలంలో చెల్లించాల్సిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రిటర్న్స్‌ను ఆలస్యంగా లేదా అస్సలు సమర్పించలేదని తేలింది.

Telugu Indianproducts, Insolvency, Rajesh Voralia-Telugu NRI

అలాగే ఆర్టీఎస్ టెక్స్‌టైల్స్ రీసైక్లర్లు అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్లినప్పుడు జరిమానా సహా దాదాపు 1.2 మిలియన్ పౌండ్ల పన్నును చెల్లించాల్సి ఉంటుంది.2015 మార్చి నుంచి డిసెంబర్ 2017 మధ్య 16.4 మిలియన్ పౌండ్ల లావాదేవీలు బ్యాంక్ ద్వారా జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఇంత వ్యాపారం జరిగినా కేవలం 80 వేల పౌండ్ల కంటే తక్కువ పన్ను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారు.ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ ప్రారంభంలో జరిగిన విచారణలో కంపెనీ డైరెక్టర్‌గా వున్న రాజేశ్‌ దోషిగా తేలడంతో ఆయనపై హైకోర్టు ఆరేళ్ల నిషేధాన్ని విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube