Neil Basu: పిల్లాడినన్న కనికరం లేకుండా కొట్టారు : యూకేలో జాత్యహంకారంపై భారత సంతతి పోలీస్ అధికారి

దేశంలో నెలకొన్న వలస సంక్షోభంపై యూకే హోంమంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిపై పలువురు రాజకీయ నేతలు, వివిధ వర్గాల ప్రజలు, మీడియా ఆమెపై మండిపడుతున్నాయి.

 Indian-origin British Police Officer Neil Basu Voices His Concern On Racism , In-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి నీల్ బసు సైతం సుయెల్లా వ్యాఖ్యలను ఖండించారు. బుధవారం ఛానెల్ 4కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.

యూకేలో పోలీస్ ర్యాంకుల్లో , హోమ్ ఆఫీస్‌లో వున్న జాత్యహంకారంపై ఆందోళన వ్యక్తం చేశారు.

త్వరలో పదవీ విరమణ చేయనున్న నీల్ బసు.దేశ హోంమంత్రి కార్యాలయం నుంచి వచ్చే కొన్ని వ్యాఖ్యానాలు వివరించలేనివిగా అభివర్ణించారు.1968లో యూకే నుంచి సామూహిక వలసలను తరిమికొట్టిన దివంగత కన్జర్వేటివ్ ఎంపీ ఎనోక్ పావెల్ ప్రసంగాన్ని నీల్ బసు గుర్తుచేశారు.1960వ దశకంలో వీధుల్లో తిరుగుతున్న శ్వేతజాతియేతర జంటలను రాళ్లతో కొట్టారని ఆయన తెలిపారు.30 ఏళ్ల పాటు సాగిన తన పోలీసింగ్ కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను కూడా నీల్ బసు వెల్లడించారు. 1970వ దశకంలో తెల్లవారు ఎక్కువగా నివసించే ప్రాంతంలోని ఆల్ వైట్ స్కూల్‌లో .శ్వేతజాతియేతర పిల్లవాడినైన తనను తీవ్రంగా కొట్టారని నీల్ బసు గుర్తుచేసుకున్నారు.జాతి, సామాజిక అన్యాయానికి సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు.

Telugu Boris Johnson, Racism, Indian Origin, Neil Basu, Federal Bureau-Telugu NR

కాగా.అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు సమానమైన బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ జనరల్ పదవికి బసు ఎంపికైన సంగతి తెలిసిందే.ది సండే టైమ్స్ కథనం ప్రకారం.

ఈ పదవికి స్కాట్‌లాండ్ యార్డ్ మాజీ చీఫ్ లార్డ్ బెర్నార్డ్ హుగన్ హౌ, నీల్ బసు తుది వరకు పోటీలో నిలిచారు.కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ మాత్రం బెర్నార్డ్ వైపే మొగ్గుచూపింది.

దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన నీల్ బసు.ఈ నియామక ప్రక్రియ పట్ల నిరాశకు గురయ్యానని, మళ్లీ దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు.అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, మాజీ హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌లు ఆయన వైపు మొగ్గుచూపకపోవడం వల్ల అత్యున్నత పదవి బసు చేజారింది.ఈ క్రమంలోనే దేశంలోని పోలీసింగ్‌లో సంస్థాగత జాత్యహంకారం వుందని అంగీకరించాలని.

అతను బ్రిటన్‌లోని పోలీస్ ఉన్నతాధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీస్ ర్యాంకుల్లో శ్వేతజాతియేతర అధికారుల సంఖ్యలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube