సముద్రంలోకి కొట్టుకుపోయిన భారత సంతతి బాలుడు: ‘‘టీవీ షో’’ తో బయటపడ్డాడు

ఎప్పుడో.ఎక్కడో చూసిన జ్ఞాపకం మన ప్రాణాలు కాపాడితే.ఇంగ్లాండ్‌లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.విహారయాత్ర కోసం కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ పదేళ్ల బాలుడు.టీవీలో చూసిన డాక్యుమెంటరీ షోలో చెప్పిన సూచనల ద్వారా ప్రాణాలతో బయటపడ్డాడు.భారత సంతతికి చెందిన రవీ షైనీ కుటుంబంతో కలిసి జూలై 31న ఉత్తర సముద్ర తీరంలోని సౌత్ బే బీచ్‌కు వెళ్లాడు.

 Indian-origin Boy Swept To Sea Survives With Floating Skills Seen On Tv In Engla-TeluguStop.com

అక్కడ నాన్న, చెల్లితో ఆడుకుంటూ అలల వేగానికి సముద్రంలో కొట్టుకుపోయాడు.

ఆ సమయంలో పిల్లాడికి ఏం చేయాలో తెలియలేదు.

అయితే ఓసారి టీవీలో నదిపై తెలియాడే చిట్కాలను డాక్యుమెంటరీలో చూశాడు.అది గుర్తుకు తెచ్చుకుని చేతులు, కాళ్లను దూరంగా చాచి అలల దిశను బట్టి కదిలాడు.

సుమారు గంట పాటు ఇలా చేస్తూ తనను రక్షించాల్సిందిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు.రవి అరుపులు విన్న సహాయక సిబ్బంది అతనిని రక్షించారు.

అంత చిన్న వయసులో నడిసముద్రంలో ఎలా వుండగలిగావని వారు ప్రశ్నించారు.

దీనిపై రవి మాట్లాడుతూ.

తాను బీబీసీలో వచ్చే ‘‘ సేవింగ్ లైవ్స్ ఎట్ సీ’’ డాక్యుమెంటరీని బాగా ఇష్టంగా చూస్తానని చెప్పాడు.ఈ సందర్భంగా ఒకసారి ‘‘ ఫ్లోట్ టూ లైవ్ ’’ అనే టెక్నిక్‌ను చూశానని.

దీనిలో భాగంగా స్టార్ ఫిష్ లాగా చేతులు, కాళ్లు దూరంగా చాపి సముద్రంపై తేలియాడినట్లు చెప్పాడు.అలా బతకడానికి తాను రెండవ అవకాశం పొందానని రవి తాను ప్రాణాలతో బయటపడిన విధానాన్ని తెలియజేశాడు.

లీడ్స్‌లో చదువుకుంటున్న ఈ పదేళ్ల చిన్నారి సౌత్ బేలోని బీచ్‌‌కు తండ్రి నాథూ రామ్, తల్లి పుష్పా దేవీ , సోదరి ముస్కాన్‌తో కలిసి వెళ్లాడు.ఆ సమయంలో తనను రక్షించడానికి నాన్న ప్రయత్నించారని, కానీ అక్కడ లోతు ఎక్కువగా ఉందని రవి తెలిపాడు.

ఈ సందర్భంగా తనను రక్షించిన స్కార్‌బరోలోని లైఫ్‌బోట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేందుకు రవి అక్కడికి వచ్చాడు.అలాగే పట్టణంలోని రాయల్ నేషనల్ లైఫ్‌బోట్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube