టైమ్స్- 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో స్థానం.. ఎవరీ రవీంద్ర గుప్తా.?

యూకేలో స్ధిరపడిన భారత సంతతి బయాలిజీస్ట్‌ రవీంద్ర గుప్తాకు అరుదైన గౌరవం దక్కింది.2020 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్స్ 100 మంది ప్రభావశీల వ్యక్తుల్లో ఆయనకు చోటు దక్కింది.రవీంద్ర గుప్తా ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.దీనితో పాటు వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ సైన్స్ క్లినికల్ ఫెలోగా .డర్బన్‌లోని ‌ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోనూ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నారు.

 Who Is Ravindra Gupta? Indian-origin Biologist Named In Times 100 Most Influenti-TeluguStop.com

తాను అతనిని గుర్తించినందుకు గర్వంగా ఉందని, ఆయన హెచ్ఐవీ ఎలా జయించవచ్చో తెలియజేశారని రవీంద్ర గుప్తా గురించి ఆడమ్ కాస్టిల్లెజో తన సంక్షిప్త వ్యాసంలో పేర్కొన్నారు.

లండన్ పేషెంట్‌గా పిలవబడే కాస్టిల్లెజో హెచ్ఐవీ నుంచి కోలుకున్న రెండో వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.ఈ సందర్భంగా కాస్టిల్లెజో డాక్టర్ రవీంద్ర గుప్తాను మొదటిసారి కలిసిన సంగతిని గుర్తుచేసుకున్నాడు.

Telugu Hiv Research, Indianorigin, Ravindra Gupta, Ravindragupta-Telugu NRI

ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీతో బాధపడుతున్న లక్షలాది మందికి తాను ఆశగా మారడానికి గుప్తాయే కారణమని కాస్టిల్లెజో ప్రశంసించారు.హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లలో 95 శాతానికి హెచ్ఐవీ-1 రకం వైరస్‌లే కారణం.సీసీఆర్5 అనే గ్రాహకం ద్వారా ఇవి కణాల్లోకి చొరబడతాయి.అయితే, మనుషుల్లో కొందరికి సీసీఆర్5 గ్రాహకం మారిపోయి ఉంటుంది.

అలాంటి వారికి హెచ్ఐవీ నిరోధకత ఉంటుంది.అలాంటి వారి శరీరంలోని కణాల్లోకి హెచ్ఐవీ-1 వైరస్ చొరబడలేదు.

వారి మూల కణాలు తీసుకుని రవీంద్ర .ఆడమ్‌కు చికిత్స చేశారు.

భవిష్యతులో సీసీఆర్5 గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకుని జన్యు చికిత్సలు చేయడం ద్వారా హెచ్ఐవీని నయం చేసేందుకు అవకాశాలు ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఆయనకు హెచ్ఐవీ నయమవ్వడానికి కారణం హెచ్ఐవీ ఔషధాలు కాదని, క్యాన్సర్ కోసం తీసుకున్న మూల కణ చికిత్స అని ద లాన్సెట్ హెచ్ఐవీ జర్నల్ పేర్కొంది.

రవీంద్ర గుప్తా 1997లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వైద్య విద్యలో పట్టా పొందారు.అనంతరం 2001లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి క్లినికల్ డిగ్రీ అందుకున్నారు.

అనంతరం హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్ పూర్తి చేశారు.తర్వాత ఆక్స్‌ఫర్డ్ మరియు ది హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డీసీజెస్‌లో అంటువ్యాధులపై శిక్షణ పొందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube