అమెరికాలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థకి డీన్‌గా భారత సంతతి శాస్త్రవేత్త..!!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సీఈవోలుగా రాణిస్తున్నారు.

 Indian-origin Biologist Named Dean Of Vanderbilt University's School Of Medicine-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన బయాలజిస్ట్ జాన్ కురియన్‌కు కీలక పదవి దక్కింది.ప్రతిష్టాత్మక వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బేసిక్ సైన్సెస్‌కు డీన్‌గా కురియన్ నియమితులయ్యారు.

ఈ మేరకు వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

బేసిక్ సైన్సెస్ వ్యవస్థాపక డీన్‌గా లారెన్స్ జే మార్నెట్ వ్యవహరించారు.

వచ్చే ఏడాది జనవరి 1న కురియన్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.వాండర్‌బిల్ట్ వర్సిటీ టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో వుంది.

గత 30 సంవత్సరాలుగా కురియన్ బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ విశిష్ట ప్రొఫెసర్‌గా, కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.హోవార్డ్ న్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకుడిగానూ వ్యవహరించారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్‌లో కురియన్ సభ్యుడు కూడా.అంతేకాకుండా అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో మెంబర్.

యూకే ఇండిపెండెంట్ సైంటిఫిక్ అకాడమీ అయిన రాయల్ సొసైటీలో జాన్ కురియన్ ఫారిన్ సభ్యుడు కూడా.పబ్లిక్- ట్రేడెడ్ బయోటెక్ కంపెనీ అయిన నూరిక్స్ థెరప్యూటిక్స్ కో ఫౌండర్‌ గానూ ఆయన వ్యవహరించారు.

భారత్‌లో జన్మించిన జాన్ కురియన్.మద్రాస్ యూనివర్సిటీలో రెండేళ్లపాటు చదువుకున్నారు.1981లో జునియాటా కాలేజీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌ పూర్తి చేసిన అనంతరం 1986లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సంపాదించాడు.ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మార్టిన్ కార్ప్‌లస్‌, గ్రెగొరీ ఎ పెట్క్సీ.

హార్వర్డ్ యూనివర్సిటీలో జాన్ కురియన్‌కు మెంటార్స్‌ కూడా.కార్ప్‌లస్ కెమిస్ట్రీలో 2013లో నోబెల్ బహుమతి గ్రహీత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube