భారత సంతతి సోదరుల చేతికి యూకే దిగ్గజ కంపెనీ... ఇక ఫుడ్ సెక్టార్‌పై ఆధిపత్యమేనా..?

విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.ఇక బిజినెస్ పరంగానూ ఎన్ఆర్ఐలు సత్తా చాటుతున్నారు.

 Indian-origin Billionaire Brothers Buy Uk Fast Food Chain Leon, Mosin, Zuber, Wa-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన బిలియనీర్ సోదరులు మోసిన్, జుబేర్‌ ఇస్సాలు బ్రిటన్‌లోని దిగ్గజ ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ లియోన్‌ను కొనుగోలు చేశారు.దేశంతో తమ ఆహార సేవల కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ డీల్ చేపట్టినట్లు ఇస్సా బ్రదర్స్ వెల్లడించారు.ఈ ఒప్పందం విలువ 100 బిలియన్ పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.1,040 కోట్లు) వుండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

1970లలో భారత్‌లోని గుజరాత్ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన ఇస్సా సోదరులు యూరో గ్యారేజెస్ పేరిట పెట్రోల్ బంకులు నిర్వర్తిస్తున్నారు.భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వీరిద్దరూ ఇంధనేతర రంగాల్లోకి విస్తరిస్తున్నారు.

గతేడాది బ్రిటన్ సూపర్ మార్కెట్ దిగ్గజం ‘‘ఏఎస్‌డీఏ’’ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు.అమెరికా దిగ్గజం ‘‘వాల్ మార్ట్’’ నుంచి వీరి ఆస్డాను కొనుగోలు చేయడం విశేషం.

దాదాపు 880 కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్‌లో టీడీఆర్‌ క్యాపిటల్‌ అనే పీఈ సంస్థ కూడా కొంత పెట్టుబడి పెట్టింది.

ఇక లియోన్ సంస్థ విషయానికి వస్తే.2004లో దీనిని జాన్ విన్సెంట్, హెన్రీ డింబుల్‌బై, అలెగ్రా మెక్‌ఎవడీలు స్థాపించారు.దేశవ్యాప్తంగా 70కి పైగా రెస్టారెంట్లతో విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి వుంది.

దేశ రాజధాని లండన్ సహా ఇతర పెద్ద నగరాల్లో మంచి గుర్తింపును సైతం పొందింది.దీనికి తోడు బ్రిటన్ అంతటా కీలకమైన వ్యూహాత్మక రవాణా కేంద్రాలు ( రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు)లో 29 ఇతర ఫ్రాంచైజ్‌లను లియోన్ కలిగివుంది.

వంటలకు సంబంధించి బ్రాండెడ్ పుస్తకాలు, కిచెన్ సామాగ్రి, డోర్ డెలివరీ సదుపాయాల ద్వారా ఈ సంస్థ మంచి లాభాలను ఆర్జిస్తోంది.లియోన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేయడానికి ముందు యూకే, ఐర్లాండ్‌లలో 700కి పైగా ఫుడ్ సర్వీస్ ఔట్‌లెట్స్‌ నిర్వహిస్తోంది ఈజీ గ్రూప్.

కోవిడ్ 19 ప్రభావం వున్నప్పటికీ గతేడాది యూకే, ఐర్లాండ్‌ డివిజన్‌లలో ఆహార వ్యాపార సంస్థలు సత్తా చాటాయని నివేదికలు చెబుతున్నాయి.ముఖ్యంగా స్టార్‌బక్స్, కేఎఫ్‌సీ, బర్గర్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు కింగ్, గ్రెగ్స్, స్బారో, సిన్నబోన్, సబ్వేలు మంచి లాభాలు గడించాయి.

ఇస్సా కుటుంబం 2001లో స్థాపించిన ఈజీ గ్రూప్ యూరప్, యూఎస్, ఆస్ట్రేలియాలలో 6,000 చోట్ల తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.ఈ గ్రూప్‌లో 44,000 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వ్యాపారంతో పాటు సామాజిక సేవలో తమ వంతు కృషి చేస్తున్నా ఇస్సా సోదరులకు 2020లో క్వీన్ బర్త్ డే ఆనర్స్‌ లిస్ట్‌లో స్థానం దక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube